మహిళా స్ఫూర్తి-మహిళా సాధికారపు కోసం పని చేస్తా-సుజనా చౌదరి
మహిళా సాధికారత కోసం పని చేస్తా -సుజనా చౌదరి'
విజయవాడ- జన చైతన్య (తమ్మిన గంగాధర్)
పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. భవానీపురం కన్వెన్షన్ సెంటర్ లో ఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం మహిళా సాధికారత నైపుణ్య శిక్షణ-ఉపాధి అవకాశాలు సెమినార్ నిర్వహించారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని సుజనా అన్నారు. మహిళా హక్కులను జగన్ ప్రభుత్వం కాలరాసిందని, ఇందుకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆర్కే ఫౌండేషన్ -- వృత్తి నైపుణ్య కోర్సులను ప్రవేశపెట్టి మహిళలకి ఉపాధి అవకాశాలను కల్పించడం శుభ పరిణామం అన్నారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులకు శిక్షణ నిచ్చామన్నారు. సుజనా ట్రస్ట్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా పది వేల మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించానన్నారు. రానున్న రోజుల్లో పశ్చిమ నియోజకవర్గంలో వృత్తి శిక్షణ నైపుణ్య కేంద్రాలను ఏర్పాటుచేసి ఉపాధి అవకాశాలను పెంపొందించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తానని భారీ మెజారిటీతో గెలిపించాలని సుజనా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ జంధ్యాల శంకర్, రోటరీ మాజీ గవర్నర్ రామారావు శ్రామిక విద్యాపీఠం డైరెక్టర్ విద్యా కన్నన్, ఆర్కే ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.