జెసి ప్రభాకర్ రెడ్డి మాట లియో క్లబ్, టీడీపీ నాయకుల ఆచరణ బాట
జెసి ప్రభాకర్ రెడ్డి మాట లియో క్లబ్, టీడీపీ నాయకుల ఆచరణ బాట
జనచైతన్య న్యూస్- యాడికి
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి పట్టణ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో పిచ్చి మొక్కలు, కంప చెట్లు ఏపు గా పెరిగి, అనేక విష సర్పాల కు నిలయమై రోగుల ఇబ్బందులకు కారణమైన పరిస్థితి నెలకొన్న సందర్భంలో నిన్నటి రోజున మాజీ శాసన సభ్యులు జెసి ప్రభాకర్ రెడ్డి, ఆరోగ్యం సహకరించక పోయినా తాడిపత్రి మీద మమకారంతో యువతను ఉత్తేజపరచాలనే ఉద్దేశంతో మన ఊరు, మన భాధ్యత అనే అంశంపై ఆయన చేసిన సూచన లను అనుసరిస్తూ లియో క్లబ్ ఆఫ్ యాడికి యువత, యాడికి పట్టణ టీడీపీ నాయకులు కూడా తమ వంతు బాధ్యతగా ఆసుపత్రి ఆవరణంలో శ్రమదానం చేసి కంప చెట్లను,పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాల పరిశుభ్రతకు పాటుపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డాక్టర్ పరమేష్, కూడా శ్రమదానం లో పాల్గొని మాకు ఈ కంప చెట్లు కిటికీ ల గుండా గదుల్లోకి వచ్చేవని చాలా ఇబ్బందులకు గురయ్యే వారమని, రాత్రిపూట పాముల బెడద ఉండేదని, ఇపుడు ఆ ఇబ్బందులు ఏమి ఉండవని, శ్రమదానం చేసిన వారందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించిన లియో టీమ్ టీడీపీ నాయకులను అభినందించడానికి మండల సీనియర్ టీడీపీ నాయకులు చవ్వ గోపాల్ రెడ్డి, విచ్చేసి ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లియో క్లబ్ సభ్యులు విశ్వం, రఘు, కిట్టు, తిరుమలేశు, రాజ బాబు, హరి, శివ, నరేష్ , కార్తీక్, యోగి, చందు, టీడీపీ నాయకులు తిరంపురం నీలకంఠ, గండికోట లక్ష్మణ్, చంద్ర,శుభాన్, గుండా నారాయణ స్వామి, మాయకుంట్ల నారాయణ స్వామి , రహంతుల్లా, వెంకటస్వామి, రాజు, వీరేష్, పాండు, రవి, కేశవ, సెల్ పాయింట్ చాంద్ భాషా, సురేష్, లక్ష్మణ్ నాయక్, పోలా రామాంజినేయులు ఆసుపత్రి సిబ్బంది మద్దిలేటి, గౌడ్ తదితరులు పాల్గొన్నారు