చేనేత జోలి శాఖ అధికారి అప్పాజీ కి వినతి పత్రం ఇవ్వడం జరిగినది

చేనేత జోలి శాఖ అధికారి అప్పాజీ కి వినతి పత్రం ఇవ్వడం జరిగినది

చేనేత జోలి శాఖ అధికారి అప్పాజీ కి వినతి పత్రం ఇవ్వడం జరిగినది

 జనచైతన్య న్యూస్-యాడికి

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండల కేంద్రంలోని ఎంపీడీవో కమ్యూనిటీ హాల్ నందు చేనేత జోలి శాఖ అధికారి అప్పాజీ ఆధ్వర్యంలో చేనేత ముద్ర రుణాల కొరకు చేనేత కార్మికుల నుండి దరఖాస్తులు తీసుకొవడం జరిగింది. దాదాపు 60 మంది కార్మికులు చేనేత ముద్ర రుణాల కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కన్వీనర్ మామిళ్ళ నారాయణస్వామి, తాడిపత్రి నియోజకవర్గ కన్వీనర్ వేల్పుల మల్లికార్జున, చేనేత జౌళి శాఖ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధాన డిమాండ్స్ చేనేత కార్మికులకు చేనేత ముద్ర రుణాలు ఎలాంటి షరతులు లేకుండా అర్హులైన చేనేత కార్మికులకు ఇవ్వాలి. నేతన్న నేస్తం 24 వేల రూపాయలు నుండి 48 వేల రూపాయలు పెంచి అమలు చేయాలి, చేనేతకు ఉచిత విద్యుత్ 200 యూనిట్లు పవర్లూమ్ కార్మికులకు 500 యూనిట్లు అమలు చేయాలి, చేనేతపై ఐదు పర్సెంట్ జీఎస్టీ రద్దుచేసి రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. చేనేతలకు వృత్తి రక్షణ ఉపాధి భద్రత, కనీస వేతనం, గిట్టుబాటు ధర, మార్కెటింగ్ సౌకర్యం కల్పించి కార్మికులు తయారుచేసిన వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఎన్ హెచ్ డి సి పట్టు రాయితీ 15% అమలు చేయాలి, అన్ని చేనేత కేంద్రాల్లో పట్టురాయితీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి, స్థానిక చేనేత వ్యాపారస్తులతో ప్రతి ఆరు నెలలకోసారి సమావేశం నిర్వహించి,  చీరల ధరలపై, చీర కూలీ ధరలపై అధికారుల సమక్షంలో నిర్ణయం తీసుకోవాలి, ఆత్మహత్యలకు పాల్పడిన చేనేత కార్మిక కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. లేని లేనిపక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని తెలియజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు పామి శెట్టి గోపి కుళ్లాయప్ప, చింత చంద్రశేఖర్, పురుషోత్తం, రామాంజనేయులు, మోహన్, బషీర్ తదితరులు చేనేత కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.