విద్యార్థుల మృతి పై సమగ్ర విచారణ జరిపించాలి
విద్యార్థుల మృతి పై సమగ్ర విచారణ జరిపి ద్రోషు లను శిక్షించాలి
విజయవాడ-జన చైతన్య (తమ్మిన గంగాధర్)
చైతన్య మహిళా సంఘం. భువనగిరి ఎస్సీ హాస్టల్ విద్యార్థులైన భవ్య ,వైష్ణవి ల ఆత్మహత్యపై అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును సమగ్ర విచారణ జరిపి దీనికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలి. రెగ్యులర్గా హాస్టల్ కి వచ్చే ఆటో డ్రైవర్ పై పలు అనుమానాలు ఉన్నాయని, ఆటో డ్రైవర్ తరచుగా వార్డెన్ తో పాటు హాస్టల్ సిబ్బంది నందరిని షాపింగ్ కు తీసుకెళ్ళే వాడని , విద్యార్థులతో ఆటో డ్రైవర్ తరచూ గొడవ పడే వాడని , ఈ విషయాన్ని విద్యార్థినిలు ఉన్నత అధికారులకు చెప్పిన అతనిపై ఏ చర్యలు తీసుకోలేదని తెలుస్తుంది. ఇప్పటికైనా ఇతన్ని అదుపులోకి తీసుకుని విచారించాలని చైతన్య మహిళా సంఘం డిమాండ్ చేస్తుంది. ఏ ప్రభుత్వ హాస్ట ల్లో పిల్లలు కనిపించకపోయినా, వారు మృతి చెందిన హాస్టల్ వార్డెన్ బాధ్యత వహించాల్సి వస్తుంది. కావున వెంటనే హాస్టల్ వార్డెన్ ను తొలగించి , విచారణ అధికారి నీ నియమించడం వల్ల చాలా వాస్తవాలు బయటపడతాయి. వార్డెన్ ను సస్పెండ్ చేయకుండా విచారణ అధికారి ని నియమించడం వల్ల ప్రయోజనం ఉండదు. కావున వార్డెన్ ను వెంటనే సస్పెండ్ చేయాలని సి ఎం ఎస్ డిమాండ్ చేస్తుంది.భువనగిరిలో హాస్టల్ విద్యార్థులు భవ్య, వైష్ణవి ఆత్మహత్యలపై దర్యాప్తు చేసి నిందితులను శిక్షించాలని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆందోళన చేసిన 20 మంది వివిధ పార్టీల నాయకుల పై కేసు నమోదు చేయడం విచారకరం.. బాధిత కుటుంబాలతో పాటు వివిధ పార్టీల నాయకులు రాస్తారోకో చేయగా అరగంట పాటు ట్రాఫిక్కు కు అంతరాయం కలిగింది. ఇది తెలుసుకున్న ఎస్ఐ మాధవ్ గౌడ్ అక్కడికి చేరుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి రాస్తారోకోను విరమింపజేసి ,తిరిగి వీరిపై కేసు నమోదు చేయడం ఎంతవరకు సమంజసం. ఎన్నో హామీలతో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ వారు, విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారాలు చేయడం అత్యంత బాధాకరం. వివిధ పార్టీల నాయకుల సహాయంతోనే కాంగ్రెస్ పార్టీ గద్దేనెక్కింది అన్న విషయాన్ని ముఖ్యమంత్రి మరవకూడదు.
ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరు సమస్య పట్ల ఆందోళన చేయడం వారి హక్కు పిల్లలు పోగొట్టుకున్న తల్లిదండ్రులు తమ కడుపు కాలి ఆందోళన చేయకుండా ఎలా ఉంటారు? వీరి ఆందోళనకు వివిధ పార్టీల నాయకులు మద్దతు తెలపడం నేరం ఎలా అవుతుంది?
పదో తరగతి చదువుతున్న భవ్య , వైష్ణవి మృతిపై వెంటనే విచారణ చేపట్టి, కారకులు అయినవారి పై చర్య తీసుకుంటేనే, హాస్టల్ ను ఖాళీ చేసిన విద్యార్థులందరూ వచ్చే అవకాశం ఉంది. నిందితులపై వెంటనే చర్యలుతీసుకోవాలని, వివిధ పార్టీల నాయకులపై పెట్టిన కేసులు తొలగించాలని సీ.ఎం.యస్ డిమాండ్ చేస్తుంది. కన్వీనర్ బి .జ్యోతి,
కో కన్వీనర్లు శ్రీదేవి , రాధ
చైతన్య మహిళా సంఘం.