వృద్ధాశ్రమానికి నిత్యవసర సరుకులు పంపిణీ
వృద్ధాశ్రమానికి నిత్యవసర సరుకులు పంపిణీ: అమడగూరు జనచైతన్య న్యూస్: అమడగూరు
మండలంలోని గాజులవారిపల్లి వద్ద ఉన్న మాతృశ్రీ వృద్ధాశ్రమానికి ఓబుల దేవరచెరువు మండలం నారప్ప గారి పల్లికి చెందిన రెడ్డిపల్లి మహేశ్వర్ రెడ్డి, గీతా దంపతులు తమ ఏకైక కుమారుడు రిక్విత్ తొలి పుట్టినరోజు సందర్భంగా 10, వేల రూ :విలువ చేసే నిత్యవసర సరుకులను వృద్ధాశ్రమ నిర్వాహకురాలు అరుణ జ్యోతి కి శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వృద్ధులకు బ్రెడ్ల్లు, పండ్లను అందించారు. అనంతరం పుట్టినరోజు కేక్ కట్ చేసి చిన్నారికి ఆశీస్సులు అందించారు.భవిష్యత్తులో తమ వంతుగా వృద్ధాశ్రమానికి మరింత సహకార అందిస్తామని మహేశ్వర్ రెడ్డి గీత దంపతులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దంపతులకు వృద్ధాశ్రమ నిర్వాహకురాలు కృతజ్ఞతలు తెలియజేశారు