మచిలీపట్నం కార్పొరేషన్ మురుగు నీరు ప్రజల ప్రాణాలతో చలగాటం

మచిలీపట్నం కార్పొరేషన్  మురుగు నీరు ప్రజల ప్రాణాలతో చలగాటం

కృష్ణా- మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ నీరు ప్రజల ప్రాణాలతో చలగాటం రక్షిత మంచి (మురికి) నీరు 

విజయవాడ-జన చైతన్య (తమ్మిన గంగాధర్)

భారత దేశంలోనే రెండవ చారిత్రాత్మక మున్సిపాలిటీ అని తమ బ్యాండు తామే వాయించుకునే మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ గతంలో ప్రతిరోజు ప్రజలకు అందించిన మంచినీరు ఇప్పుడు వారానికి రెండు సార్లు మాత్రమే అందిస్తున్నారు ఆ ప్రజలు తాగే మంచినీరు "మనది ఒక బతుకేనా కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె" అన్నా మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని మరిపించే విధంగా ఉంటున్నాయి ప్రజలు తాగే నీరు పచ్చటి నాచు డ్రైనేజి మురికి పాకుడు తో కలిసి ప్రజలకు సరఫరా అవుతున్నాయి ఎండాకాలం మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ డయేరియా నీళ్ల విరోచనాలు కలుషిత మంచినీళ్లు తాగడం వల్ల కలిగే వ్యాధులని ప్రజలకు తెలిసిన ఏమీ చేయలేని దుస్థితి కొందరు మునిసిపల్ కమిషనర్ను మేయర్ ను మున్సిపల్ సిబ్బందిని వివరణ కోరగా ఈ నీరు రావటమే మీ అదృష్టంగా భావించాలి నచ్చకపోతే మినరల్ వాటర్ కొనుక్కోండి ప్రైవేటు వాటర్ ట్రాక్టర్లతో కొనుక్కుని వాడుకోండి అని నిర్లజ్జగా సమాధానం ఇస్తున్నారని స్థానిక ప్రజల సమాచారం మున్సిపల్ అధికారులు ఇరిగేషన్ వారు మినరల్ వాటర్ ప్రైవేట్ వాటర్ సప్లై వారి వద్ద కోట్ల రూపాయల లంచాలు తీసుకుంటున్నారని సమాచారం మరికొందరు రాజకీయవేత్తలు పేర్ని వెంకటరామయ్య నానికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా కొడుకు పేరుని కృష్ణమూర్తి కిట్టుకు టికెట్ వచ్చినందుకే నాని కోటరీ అతనిని గెలవకుండా చేయడానికి ఇటువంటి పనులు చేస్తున్నారని విమర్శిస్తున్నారు ఎంఎంసీ అందిస్తున్న మంచినీరు దేనికి పనికి రాకపోవడంతో స్థానిక వార్డుల ప్రజలు నీటి పన్ను నాలుగు రెట్లు పెంచిన ప్రజలకు ఈ అధోగతి ఏమిటని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారులైన ప్రజల ఆరోగ్యాన్ని ప్రాణాలను కాపాడాలి.