డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా విగ్రహానికి గౌస్ లాజమ్ పూలమాలవేసి అర్పించడం జరిగింది

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా విగ్రహానికి గౌస్ లాజమ్ పూలమాలవేసి అర్పించడం జరిగింది

*సామాజిక విప్లవ మహోపాధ్యాయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్*: *డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్*

*ఓబుళదేవరచెరువు మండల కేంద్రంలో ని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సర్కిల్ లో  డాక్టర్ బిఆర్ అంబేద్కర్  133వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డిటిఎఫ్  జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని మన దేశానికి ప్రసాదించిన నాయకుడు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ అని,

 ఆయన అడుగుజాడల్లో పయనించి ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలవాలని అప్పుడే ఆయనకు మనం నిజమైన నివాళులర్పించిన వారమవుతామన్నారు. ప్రతి దినం మన దేశ రాజకీయాలను ప్రశ్నించాల్సిన ప్రజానీకానికి బీజం నాటిన నిఖార్సైన  సాంఘిక విప్లవవాది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని తెలిపారు.ఈ కార్యక్రమంలో వెంకటచలమయ్య,నర్సింహులు,తదితరులు పాల్గొన్నారు