పెద్దపప్పూరు లో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ బొజ్జప్ప కు వినతి పత్రం ఇవ్వడం జరిగినది
పెద్దపప్పూరు లో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ బొజ్జప్ప కు వినతి పత్రం ఇవ్వడం జరిగినది
జనచైతన్య న్యూస్-పెద్దపప్పూరు
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండల కేంద్రంలో రామకోటి కాలనీలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ బొజ్జప్ప కి మాదిగ దండోరా అనంతపురం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దపప్పూరు టీ ఆదినారాయణ మాదిగ, పెద్దపప్పూరు మండలం సిపిఐ కార్యదర్శి చింతా పురుషోత్తం, పెద్దపప్పూరు మండలం ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పసల కంబగిరి మాదిగ, ఎమ్మార్పీఎస్ యువ నాయకుడు చిన్న నరసింహులు మాదిగ తదితరులు కలిసి బ్యాంకు పరిధిలో ఉన్నటువంటి వివిధ గ్రామాల నిరుపేద నిరుద్యోగులకు అందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన పథకాలను నిరుద్యోగులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ చెందిన వారికి విధిగా రుణాలు మంజూరు చేయాలని అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నాటువంటి కిరాణా అంగడి, కూరగాయలయ వ్యాపారం, చేపల వ్యాపారం, గంప వ్యాపారం, చెప్పుల వ్యాపారం, చెప్పులు తయారీ, కోళ్ల పరిశ్రమ, పాడి పరిశ్రమ, నాటు కోళ్ల వ్యాపారం ఇలా చెప్పుకుంటూ పోతే నిరుద్యోగులు ఎన్నో వ్యాపారాలు చేసుకుంటున్నారు, వీరికి విధిగా రుణాలు మంజూరు చేయాలని బ్యాంక్ మేనేజర్ బొజ్జప్ప కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. గతంలో రాజకీయ నాయకులు చెప్పితే వారికి ఇచ్చేవారు, ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కచ్చితంగా వారిని ఆదుకోవాలని, ఉద్దేశంతో ప్రభుత్వ పథకాలను ప్రకటించడం జరిగింది. అందుకు బ్యాంకు మేనేజర్ స్పందించి కచ్చితంగా వారి అందరికీ న్యాయం చేస్తామని తెలపడం జరిగింది.