జనసేన పార్టీ గౌరీ శంకర్ ని కలిసిన ఎమ్మెస్ బెగ్
జనసేన పార్టీ నాయకుడు గౌరీ శంకరు ని పరామర్శించిన ఎమ్ ఎస్ బెగ్
విజయవాడ - జనచైతన్య (తమ్మిన గంగాధర్ )
జనసేన పార్టీ 47వ డివిజన్ అధ్యక్షులు గౌరీ శంకర్, ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయంపై, స్థానిక వైసిపి కార్పొరేటర్ గోదావరి గంగా ఆమె భర్త గోదావరి బాబు మరియు వారి కుమారుడు, కలిసి గౌరీ శంకర్ పై దాడి చేసిన విషయాన్ని, డివిజన్ అధ్యక్షులు కూరాకుల మల్లేశ్వర రావు సూచనలతో, డివిజన్ నాయకులు నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షులు నమ్మి భాను ప్రకాష్, డివిజన్ ప్రధాన కార్యదర్శి మక్కిన భాస్కర్, జరిగిన ఘటనను నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు ,ఎంఎస్ బేగ్ తెలపగా, ఈరోజు ఉదయం 11 గంటలకు 47వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు వేంపల్లి గౌరీ శంకరును వారి కార్యాలయంలో, కలిసి జరిగిన దాడి గురించి అడిగి తెలుసుకుని, వారితో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తరఫున ఈ దాడిని ఖండిస్తున్నామని, తనకి పార్టీ తరఫున అండగ ఉంటూ ఈ ఘటనకు కారణం అయిన వారికి న్యాయ పరంగా శిక్ష పడే వరకు వదిలి పెట్టబోమని తెలియజేశారు, అలాగే శంకరును కలిసిన వారిలో , పార్టీ పార్లమెంట్ కార్యదర్శి సారేపల్లి రాధా , 47 వ డివిజన్ కస్టర్ ఇంచార్జ్ బెవర సాయి సుధాకర్, నియోజవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎర్ర రామారావు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి డివిజన్ నాయకులు, కంబాల దుర్గారావు, కానుళ్ల చంద్రశేఖర్,వానపల్లి శ్రీనివాసరావు, చిలక రాజు రాంబాబు, పెద్ది నూకరాజు, మరిపిల్ల దుర్గారావు, ఎస్ కే జిలాని, తదితరులు పాల్గొన్నారు .