కేసినేని నాని కి మద్దతుగా గౌస్ మొహిద్దిన్

కేసినేని నాని కి మద్దతుగా  గౌస్ మొహిద్దిన్

కేశినేని నాని మద్దతు పై గౌస్ మొహిద్దిన్ హర్షం 

విజయవాడ - జనచైతన్య (తమ్మిన గంగాధర్ )

టిడిపి ఎంపి కేశినేని నాని ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడాన్ని,వైఎస్ జగన్మోహనరెడ్డిసంక్షేమ,అభివృద్ధి పాలనకు ఆకర్షితులై వైసిపికి మద్దతు ప్రకటించడాన్ని స్వాగతిస్తూ జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మెన్,వైసిపి సీనియర్ నాయకులు షేక్ గౌస్ మొహిద్దిన్ హర్షం వ్యక్తం చేశారు.స్వతహాగా ముక్కుసూటి మనిషి అయిన నాని టిడిపి లో చంద్రబాబు,లోకేష్ ల వల్ల అనేక అవమానాలు పడ్డారని,చివరకు కాల్ మని,సెక్స్ రాకెట్ వంటి కేసుల్లో ఉన్న బుద్ధా వెంకన్న వంటి వారితో నాని ని తీవ్రంగా తిట్టించి అవమానించారని ఆయన పట్ల అహంకార ధోరణితో ప్రవర్తిస్తూ పొమ్మనలేక పొగపెట్టే విధంగా వ్యవహరించారని అన్నారు.తన వ్యక్తిగత చరిష్మాతో కేశినేని నాని గత పార్లమెంటు ఎన్నికల్లో గెలిచారని,ఎన్టీఆర్ నుండి టిడిపి ని లాక్కున్న చంద్రబాబు నాయకత్వంలో నిజాయితీ పరులకు స్థానం లేదని నాని ఎపిసోడ్ ద్వారా మరోసారి తేటతెల్లం అయ్యిందని గౌస్ మొహిద్దిన్ అన్నారు. వైఎస్ జగన్  నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి సాధ్యమని ఈసందర్భంగా గౌస్ మొహిద్దిన్ తెలియజేస్తూ కేశినేని నాని వంటి వారి రాక దానికి మరింత బలపరుస్తుంది అన్నారు.