ఆడపిల్లలపై నిర్లక్ష్యం వహిస్తున్న ఏబీసీ డబ్ల్యూ ఓ పై చర్యలు తీసుకోవాలి,ఎన్ ఎస్ యు ఐ జిల్లా నాయకులు గాలివీడు ఉపేంద్ర
ఆడపిల్లలపై నిర్లక్ష్యం వహిస్తున్న ఏబీసీ డబ్ల్యూ ఓ పై చర్యలు తీసుకోవాలి,ఎన్ ఎస్ యు ఐ జిల్లా నాయకులు గాలివీడు ఉపేంద్ర
జనచైతన్య న్యూస్-కదిరి
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజవర్గంలోని డిగ్రీ కళాశాలలు ప్రారంభం కావడం తో డిగ్రీ కళాశాల విద్యార్థులు సోమవారం రావడం జరిగింది.అందులో భాగంగా వచ్చినటువంటి విద్యార్థినీలకు హాస్టల్ ఓపెన్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని ఎన్ ఎస్ యూ ఐ జిల్లా నాయకులు గాలివీడు ఉపేంద్ర ధ్వజ మెత్తారు.కళాశాల లకు వచ్చిన ఆడపిల్లలను ఏబీసీ డబ్ల్యూ ఓ కి హాస్టల్ విషయం పై తెలియజేయగ నిర్లక్ష్యం వహిస్తూ మీ ఊర్లకు తిరిగి వెళ్లిపోండి అని చెప్తున్నారని ఇలా అనడం సమంజసం కాదని ఆడపిల్లల పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారని ఉపేంద్ర అన్నారు.సమాజం లో ఆడబిడ్డలకు భద్రత లేదని తెలిసి కూడా అర్ధరాత్రిలో ఇండ్లకు వెళ్ళండి, అంటే ఎక్కడ వెళ్తారని అన్నారు.పై అధికారులు స్పందించి ఏబీసీ డబ్ల్యూ ఓ బాలాజీ మీద బాయ్స్ ఇంటర్, డిగ్రీ కళాశాల హాస్టల్ వార్డెన్ జయరాం రెడ్డి, షబానా మీద చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యూ ఐ నాయకులు సంతోష్, నాగ, టిప్పు సుల్తాన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.