సెంట్రల్లో అభివృద్ధి జరగలేదు-బోండా ఉమా

సెంట్రల్లో   అభివృద్ధి జరగలేదు-బోండా ఉమా

బోండా ఉమా ఇంటి వద్ద సెంట్రల్లో అభివృద్ధి లేదు సమావేశం నిర్వహించారు

విజయవాడ _ జనచైతన్య (తమ్మిన గంగాధర్)

ఈ సమావేశంలో బోండా ఉమా మాట్లాడుతూ ఈరోజు గొప్పలు చెప్పుకుంటున్నటువంటి వైసీపీ పార్టీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేశారు ప్రజలకు వివరించాలని ఈ నాలుగు సంవత్సరాల జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఎక్కడైనా అభివృద్ధి అనేది జరగలేదని ఈ సెంట్రల్  నియోజకవర్గంలో తాను శాసనసభ్యులుగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి తప్ప నేడు ఈ వైసీపీ పాలనలో ఒక్క శాతం పనులు కూడా పూర్తి కాలేదని  ఈ సెంట్రల్ నియోజకవర్గంలో మధురానగర్ RUB ని తాను మొదలు పెడితే దానిని పూర్తి చేయలేనటువంటి అసమర్ధ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వాన్నిదని, మధురానగర్ దేవినగర్ ఫ్లైఓవర్ నో పూర్తి చేసి ఇటు నుంచి అటు పనులకు స్కూళ్లకు వెళ్లేవారికి ఉపయోగకరంగా ఉండే విధంగా చేసినది తెలుగుదేశం ప్రభుత్వం అని తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనని

సెంట్రల్ నియోజకవర్గంలో ముస్లింలకు కబరస్థాన్ నిర్మాణానికి ఒక కోటి 50 లక్షల రూపాయలు ఖర్చుపెట్టినది నిజం కాదా అని, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని మరుగుదొడ్లు కట్టించినది నిజం కాదా అని, కళ్యాణ మండపాలే గాని ,స్కూల్స్, ఆరోగ్య కేంద్రాలు రోడ్లు వేపించినది తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనైనా అని ఎంత అభివృద్ధి చేస్తే ఏమి అభివృద్ధి చేశారని ఈరోజు ఎక్కడో పక్కన నియోజకవర్గం నుంచి తోలేస్తే వచ్చిన వెల్లుల్లిపాయ వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడడం చాలా హాస్యపదంగా ఉన్నదని

ఈరోజు తాను చేసిన అభివృద్ధిని సెంట్రల్ నియోజకవర్గం ప్రజలు ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకొని మరల తిరిగి బోండా ఉమా ఎమ్మెల్యేగా గెలవాలని కోరుకుంటున్నారని ఈరోజు వైసిపి పతనం అవుతుందని తెలిసి ఓర్వలేక వెల్లంపల్లి శ్రీనివాస్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని దమ్ముంటే తాను చేసిన అభివృద్ధి నిజం కాదని నిరూపించాలని నిరూపించ లేకపోతే బెల్లంపల్లి శ్రీనివాస్ కామ్ గా కూర్చోవాలి తప్ప అభివృద్ధి చేయలేదంట సరైనటువంటి పద్ధతి కాదని బొండ ఉమ తెలియజేశారు.

ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి నవనీతో సాంబశివరావు, గార్లపాటి విజయ్ కుమార్, పైడి శ్రీను తదితరులు పాల్గొన్నారు.