శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం,ఈవో ఆవేదన ఇంద్రకీలాద్రి

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం,ఈవో ఆవేదన ఇంద్రకీలాద్రి
(జనచైతన్య న్యూస్)అమ్మవారి ప్రధానలయంనకు సంబంధించిన ఒక వీడియో గత 2 రోజులుగా పలు సామాజిక మాధ్యమములో వైరల్ అవుచున్న విషయం ఇదివరకే మా దృష్టికి వచ్చినది.వెంటనే సంబంధిత అధికారులను ఆదేశించి,సీసీ కెమెరాల ద్వారా అందుకు సంబందించిన విచారణ చేపట్టి కొందరు అనుమానితులను గుర్తించడం జరిగినది.దేవస్థానం పరువుకు భంగం కలిగించు ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై పోలీసు శాఖ ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకొనుటకు గాను చర్యలు ఆల్రెడీ మొదలైనవి.అంతే గానీ,కొన్ని ప్రముఖ ఛానెల్ లలో ప్రచారమైనట్లుగా దేవస్థానం వారు ఎటువంటి చర్యలు తీసుకొనలేదు,అని ప్రచారం చేస్తున్న విషయం అవాస్తవం తెలియజేయడమైనది.అమ్మవారి సేవలో కార్యనిర్వాహణాధికారి