ఇళ్ల స్థలాల కోసం కథo తొక్కిన కమ్యూనిస్టులు, తాడిపత్రిలో సిపిఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

ఇళ్ల స్థలాల కోసం కథo తొక్కిన కమ్యూనిస్టులు, తాడిపత్రిలో సిపిఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
జన చైతన్య న్యూస్-తాడిపత్రి
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం లో సిపిఐ ఆధ్వర్యంలో ఇంటి స్థలం ఇంటి నిర్మాణం చేసేదాకా ఉద్యమం ఆగదు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరిక కూడు,గుడ్డ,నీడ నినాదంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో పేదవాడికి పట్టణాల్లో రెండు సెంట్లు,పల్లెల్లో మూడు సెంట్లు నివేశ స్థలం ఇచ్చి 5 లక్షల వ్యయంతో పక్కా ఇంటి నిర్మాణం చేస్తామని చెప్పి,అధికార చేపట్టినప్పటి నుంచి కాలయాపన చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. మంగళవారం అనంతపురం జిల్లా తాడిపత్రిలో దాదాపు మూడు వేల మందితో పేదవాళ్లతో కలిసి ఇంటి స్థలము, పక్కా ఇంటి నిర్మాణం కోసం కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో తహశీల్దారు కార్యాలయం ముందు తాడిపత్రి సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి అధ్యక్షుతన భారీ ధర్నా జరిగింది. ఈ సందర్భంగా వేలాది మంది నిరుపేద లబ్ధిదారులు తరలివచ్చారు. బహిరంగ సభ ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ పేదలకు బలమైన భరోసా ఇచ్చిందని పట్టణ ప్రజలకు రెండు సెంట్ల నివేశ స్థలం ఇచ్చి నాలుగు లక్షలతో పక్కా ఇంటి నిర్మాణం చేపడతామని,పల్లెల్లో మూడు సెంట్ల స్థలం ఇస్తామని నమ్మ బలికిందన్నారు. అధికారంలోకి వచ్చాక కూడా ప్రతి కేబినెట్ మీటింగ్ లో 26 జిల్లాల్లో పేదవాళ్ళను గుర్తించి పక్కా ఇంటి నిర్మాణం చేపడతామని రాజకీయాలకు అతీతంగా చూస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే క్షేత్రస్థాయిలో రెవెన్యూ,మున్సిపల్ సిబ్బంది ముందుకు సాగడం లేదని ఆవేదన చెందారు. పేదవాళ్లందరికీ ఇంటి స్థలం దక్కేదాకా కమ్యూనిస్టు పార్టీ తోడుగా ఉంటుందన్నారు. అర్జీల రూపంలో ప్రజల నుంచి తీసుకున్న ఫిర్యాదులను సంబంధిత అధికారులకు చేర్చి న్యాయం జరిగేదాకా మీ వెంట ఉంటామని భరోసా ఇచ్చారు. తాడిపత్రి, మదనపల్లి,కర్నూలు తదితర పట్టణాల్లో ఇప్పటికే ఆందోళన ఉదృతమైందని ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గమనించాలని సూచించారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయని ఇంటి స్థలాలు ఇచ్చి పక్కా ఇంటి నిర్మాణం చేసేదాకా పోరాడుతామని లబ్ధిదారులు ఎవరూ భయపడాల్సిన పనిలేదని రామకృష్ణ కోరారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ మాట్లాడుతూ తాడిపత్రి పట్టణంలో అనేక మంది లబ్ధిదారులు పక్కా ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జిల్లా వ్యాప్తంగా ఇదే సమస్య నెలకొందని ఎమ్మెల్యేలు రెవెన్యూ,హౌసింగ్, మున్సిపల్ అధికారులు చొరవ తీసుకొని లబ్ధిదారు గుర్తించాలని సూచించారు. జగన్ హయాంలో సెంటు భూమిలో పక్కా ఇల్లు నిర్మిస్తే అవి పేదవాడికి సరిపోలేదని గుర్తు చేశారు. టిడిపి ప్రభుత్వం అయినా పేదల పట్ల ప్రేమ చూపించి పక్క ఇంటి నిర్మాణం చేసి ఇవ్వాలని టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు కూడా పక్కా ఇండ్లను అప్పగించాలని డిమాండ్ చేశారు.