ప్రభుత్వ కార్యక్రమాలకు ఆర్డీటీ సహకారం
ప్రభుత్వ కార్యక్రమాలకు ఆర్డీటీ సహకారం
జనచైతన్య న్యూస్- బత్తలపల్లి
బత్తలపల్లి ఆర్డిటి ఆఫీస్ నందు ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్ కోసం ఉమ్మడి ప్రణాళిక, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, మహిళా సాధికారతకి ఆర్డీటీ ఎనలేని కృషి విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో ఆర్డీటీ నిర్వాహకులు మాంఛో పెర్రర్ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు తమ వంతు సహకారం పూర్తిగా అందిస్తామని ఆర్డీటీ (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్) నిర్వాహకులు మాంఛో ఫెర్రర్ తెలిపారు. ఉండవల్లి నివాసంలో ఆదివారం విద్యా, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్‌ని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వాహకులు మాంఛో ఫెర్రర్ కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మంగళగిరి చేనేత శాలువాతో ఫెర్రర్‌ని సత్కరించారు. ప్రభుత్వానికి సమాంతరంగా ఆర్డీటీ అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకం అని మంత్రి పేర్కొన్నారు. 1969లో విన్సెంట్ ఫెర్రర్ ప్రారంభించిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 3 వేల గ్రామాల్లో అందిస్తున్న సేవలను మంత్రి కొనియాడారు. వేల కోట్ల ఖర్చుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పల్లెల్లో ఆసుపత్రులు నిర్మాణం, పేదలకు ఆర్ధిక సహాయం, ఇళ్ల నిర్మాణం, విద్య, వైద్యం, చెక్ డ్యాంల నిర్మాణం, గ్రామాల్లో తాగునీటి సదుపాయం కల్పించిన ఆర్డీటీ.