గుత్తి వద్ద గొర్రెల మందపైకి లారీ,15 గొర్రెలు మృతి

గుత్తి వద్ద గొర్రెల మందపైకి లారీ,15 గొర్రెలు మృతి

గుత్తి వద్ద గొర్రెల మందపైకి లారీ,15 గొర్రెలు మృతి

 జనచైతన్య న్యూస్- గుత్తి

 అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం గుత్తి మండలం శ్రీపురం (కొజ్జెపల్లి )గ్రామ సమీపంలోని 63వ నెంబర్ జాతీయ రహదారిపై శనివారం గొర్రెల మందపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సుమారు 15 గొర్రెలు మృతి చెందాయి. బాధిత రైతు బోలి గోర్ల పాపన్న మాట్లాడుతూ, గొర్రెలు పెంచుకొని జీవనం సాగిస్తున్నానని 15 గొర్రెలు మృతి చెందడంతో సుమారు రూ,1.50 లక్షల మేర నష్టపోయానని వాపోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.