సూది మందు వికటించి మహిళ మృతి
సూది మందు వికటించి మహిళ మృతి
జనచైతన్య న్యూస్- తనకల్లు
సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండల పరిధిలోని కొక్కంటి క్రాస్ లోని ఎం.ఆర్. క్లినిక్ నిర్వహిస్తున్న ఆర్.ఎం. పి డాక్టర్ అబ్దుల్లా నిర్వాకం వలన మహిళ మృతి చెందినట్లు బందువులు ఆరోపిస్తున్నారు. తనకల్లు మండలం కొక్కంటి గ్రామO ఎస్సీ కాలనీ కి చెందిన ఉత్తమ్మ(50) అనే మహిళకు గత వారం రోజుల నుండి జ్వరం వస్తోందని, డాక్టర్ వద్దకు వెళ్ళగా అతను సూది మందు ఇవ్వగానే మహిళా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని వాపోయారు. వెంటనే వారి బంధువులు తనకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని రాగా ఆసుపత్రిలో మరణించింది. అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు విలపించారు.