తలుపుల మండలంలో పట్టించుకోని ప్రభుత్వ అధికారులు
తలుపుల మండలంలో పట్టించుకోని ప్రభుత్వ అధికారులు
జనచైతన్య న్యూస్- తలుపుల
సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉండే అమూల్ డైరీ దగ్గర పాలు కడిగిన క్యాన్లు కడుగా వచ్చు వాటర్ ఒక గుంతలోపడుతుంది. ఆ గుంత నిండిపోయి దాదాపు నెల రోజుల నుంచి వేస్టేజ్ వాటర్ బయటికి వెళుతున్నాయి.
దానివలన దుర్వాసన వస్తున్నది, అక్కడ ఉండే ఎమ్మార్వో ఆఫీస్ లో అధికారులు గానీ అక్కడ ఉండే ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది గాని పట్టించు కొలేదు. ఈ డైరీలో పనిచేస్తున్న సూపర్వైజర్ అధికారులు ఎట్ల పోతే మాకేమి లే అన్నట్లు వున్నారు. అక్కడికి దగ్గర్లో చిన్నపిల్లలు చదివే ఎంపీపీ స్కూల్ ఉన్నది, ఆ వాసన దాదాపు అంటే 200 మీటర్లు తగులుతాది చిన్నపిల్లలకి దుర్వాసన వచ్చి ఇన్ఫెక్షన్ జరిగితే దీనికి, కారకులు ప్రభుత్వ అధికారులే అవుతారని తెలుపుతున్నను.