అజిత్ సింగ్ నగర్ టిడిపి కార్యాలయంలో సర్వసభ్య సమావేశం
సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయం అజిత్ సింగ్ నగర్ సర్వసభ్య సమావేశం
విజయవాడ _జన చైతన్య (తమ్మిన గంగాధర్)
స్థానిక 57వ డివిజన్ సర్వసభ్య సమావేశం ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు హాజరయ్యారు.ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ఎన్నికలు ఎంతో దూరంలో లేవని ప్రతి ఒక్కరూ కూడా డివిజన్ పరిధిలో జనసేనతో సమన్వయం చేసుకొని ఎన్నికలకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు మరొక 90 రోజుల్లో జరగబోతున్నాయని అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ వైసీపీ ప్రభుత్వం ఏదైనా చేస్తుందని, కొత్త ఓటర్ లిస్టులను డివిజన్లో పంపిణీ చేసాము కాబట్టి 57వ డివిజన్ పరిధిలో ఓట్లు సరి చూసుకోవడం అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రకటించినటువంటి మినీ మేనిఫెస్టో ఆరు పథకాలను ప్రజలకు చేరువయ్యలా చేయడం ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా మేలు జరిగింది ఈ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రజలు ఏ విధంగా నష్టపోయింది ప్రజలకు ప్రతి ఒక్కరూ వివరించాలని సూచించారు. ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో చాలామంది నాయకులు కష్టపడి పని చేశారని కొంతమంది ఉద్యోగాలు నిమిత్తం వ్యాపారాలు నిమిత్తం పార్టీకి ఎక్కువ సమయంలో వెచ్చించలేకపోయారని కానీ ఇప్పుడు కూడా అందరూ ప్రజల్లోనే ఉండాలని ఎన్నికలు అయ్యేదాకా తెలుగుదేశం పార్టీ విజయం కోసం నారా చంద్రబాబునాయుడు ని మరలా ముఖ్యమంత్రిని చేయడం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈరోజు వైసీపీ ప్రభుత్వం వచ్చినాక నిత్యవసర ధరలు, గ్యాస్ ధరలు,పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు అన్ని రకాలుగా పెంచి సామాన్యుడిని బతుకును చిన్నాభిన్నం చేశారని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిరుపేదలు సామాన్యులు దిగువ మధ్య తరగతికి చెందినవారు వారి కుటుంబంతో చాలా ఆనందంగా గడిపేవారు అని ఈరోజు ప్రజలకు తెలుగుదేశం పార్టీ వైసిపి మధ్య వ్యత్యాసం ప్రజలకు చెప్పినట్లయితే వారే ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకుంటారని తెలిపారు. ఈ వైసీపీ ప్రభుత్వ విధానాలే ప్రజలకు గుదిబండగా మారాయని సాఫీగా జరిగిపోయే ఇసుకను ఆపి కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టడం ద్వారా లక్షలాదిమంది భవన నిర్మాణ కార్మికులు ఈరోజు అర్దాకలితోఅలమటిస్తున్నారని ఈ జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని చెప్పి నిరుద్యోగులను విద్యార్థులను నిట్టనినువుల మాసగుంచారని అన్నా క్యాంటీన్ ను ఎత్తివేసి బీద బడుగు బలహీన చిరు వ్యాపారులకు మధ్యాహ్నం భోజనం లేకుండా చేశారని సమాజంలో అన్ని వ్యవస్థల మీద అందరి వ్యక్తుల మీద అన్ని వర్గాల మీద దెబ్బ కొట్టినది ఈ వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంమనిదుయ్యబట్టారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం చారిత్రాత్మక అవసరమని నారా చంద్రబాబునాయుడు పాలన తో మరల తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాత రోజులు తిరిగి వస్తాయని ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో అందరికీ వివరించాలని రాబోయేది తెలుగుదేశం జనసేన కోటమీదే అని చాటి చెప్పాలని తెలిపారు. డివిజన్ పరిధిలో నియోజకవర్గ పరిధిలో జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి పని చేయాలని సూచించారు, ప్రజల్లోకి వెళ్లి ఓట్లు ఉన్నవో లేవో చూసి వారి బాధ్యతను వారికి గుర్తుచేయాలని ఎన్నికలకు వారం రోజులు ముందు వరకు కూడా కొత్తగా ఓటు హక్కును నమోదు చేసుకునేటువంటి అవకాశం ఎలక్షన్ కమిషన్ కల్పించింది అని తెలిపారు. ఇకనుండి ప్రతి 15 రోజులకు ఒకసారి డివిజన్ మీటింగులు జరుగుతుందని డివిజన్ మీటింగ్లో ఆ పదిహేను రోజులకు జరిగినటువంటి పరిణామాలను చర్చించుకుందాం. అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబొతు రమణ,ఘంటా కృష్ణమోహన్, బోని నాని, శొంఠి ఈశ్వరి, లీల, రాణి , సత్యనారాయణ, ఇమ్మానియేల్, శృతి తదితరులు పాల్గొన్నారు.