వెల్లంపల్లి కీలక బాధ్యతలు ఇచ్చిన సి.ఎం. జగన్
టార్గెట్ క్లీన్ స్వీప్ వెల్లంపల్లి కి జగన్ కీలక బాధ్యతలు
విజయవాడ - జనచైతన్య (తమ్మిన గంగాధర్ )
అలాగే వచ్చే ఎన్నికల్లో మారారు గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత సీఎం జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు .ఇందులో భాగంగా ' టీడీపీని దాదాపు ఖాళీ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.స్థానిక రాజకీయ లెక్కలు , సామజిక సమీకరణాలని పరిగణనలోకి తీసుకొని స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.ఎన్టీఆర్ జిల్లాలో జగ్గయ్యపేట , తిరువూరు , నందిగామ, విజయవాడ తూర్పు విజయవాడ పశ్చిమ విజయవాడ సెంట్రల్ , మైలవరం శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి . వీటిలో ఒక్క విజయవాడ తూర్పు తప్ప మిగతా అన్ని చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు . ఈ సారి తూర్పున కూడా వైసీపీ ఉదయించేలా మొత్తం జిల్లాలో క్లీన్ స్వీప్ చేసేలా వెల్లంపల్లి అడుగులు వేస్తున్నారు .జిల్లా నేతలతో సమన్వయము చేసుకుంటూ క్యాడర్ కి భరోసా ఇస్తూ ప్రభుత్వ పథకాలపై ప్రజలకి అవగాహనా కల్పిస్తూ ప్రజాదరణ చూరగొంటూ ముందుకుసాగుతున్నారు .ఇప్పటికే వెల్లంపల్లి కృషితో పార్టీ మరింత బలోపేతం అయింది .
ఇదే దూకుడుతో అయన ముందుకు వెళ్లడం ఫిక్స్ కాబట్టి ఎన్టీఆర్ జిల్లాలో ఫ్యాన్ జోరు సాగడం ఖాయమని చెప్పవచ్చు.