కడవకల్లులో శ్రావణికి కన్నుల పండుగుల పూల వర్షంతో ఘనంగా స్వాగతం.
(పుట్లూరు జనచైతన్య న్యూస్) కడవకల్లులో శ్రావణికి కన్నుల పండుగ లా పూల వర్షంతో ఘనంగా స్వాగతం. పుట్లూరు మండలం లో సింగనమల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బండారు శ్రావణి కి కన్నుల పండుగలా పూల వర్షం కురిపించారు. ఇందులో భాగంగా కడవ కల్లులో కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొనేందుకు విచ్చేసినటు వంటి బండారు శ్రావణి కి ప్రజలు పటాసులతో కన్నుల పండుగలా హారతులిచ్చి ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం బండారు శ్రావణి మాట్లాడుతూ పిల్లి తన కంటి చూపు కోల్పోపోతే ఎలుక వచ్చి డీజే డ్యాన్స్ వేసిందట.అలానే ఒక్క అవకాశం అంటూ ప్రజలు నమ్మి మోసపోయారని అన్నారు.వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుందని స్పష్టం చేశారు.