నీతి నిజాయితీ కలిగి ఉండాలి ప్రత్తిపాటి కార్డులు పంపీణీ సైనికుని లా సహ కార్యకర్తలు
నీతి నిజాయితీ కలిగి ఉండాలి ప్రత్తిపాటి కార్డులు పంపీణీ సైనికుని లా సహ కార్యకర్తలు
జనచైతన్య న్యూస్- విజయవాడ
విజయవాడ జిల్లాలో అమరావతి సమాచార హక్కు చట్టం,హ్యుమన్ రైట్స్ లో కాయుక్త పై అవగాహన కల్పిస్తున్న ఫోరమ్ ఫర్ ఆర్టీఐ కార్యకర్తలు నీతి నిజాయితీ కలిగి ఉండాలని,జాతీయ అధ్యక్షులు ప్రత్తిపాటి చంద్రమోహన్ స్పష్టం చేశారు.ఏపీ రాజధాని అమరావతిలో కర్నూలు జిల్లా కు చెందిన ఎఫ్ ఆర్టీఐ ఐడీ కార్డు లను జిల్లా అధ్యక్షులు పేద యల్లప్ప కు అంద జేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీఐ,హ్యుమన్ రైట్స్ కార్యకర్తలు దేశ సైనికుని వలె ప్రజలకు చట్టాల పట్ల అవగాహన కల్పించటం స్వచ్ఛంద బాధ్యత గా స్వీకరించాలని కోరారు.రోజు రోజుకు పెరుగుతున్న అవినీతిని అరికట్టేందుకు ఆర్టీఐ లు పెట్టాలని సూచించారు,మానవ హక్కులు కాపాడుట కోసం స్వేచ్చ సమానత్వం అందరికీ లభించేలా చూడాలని కోరారు,పేద ప్రజలకు న్యాయం జరిగేలా ప్రభుత్వ ఉన్నంత అధికారులతో చర్చలు జరపాలన్నారు.క్రమశిక్షణ కలిగిన ఒక్కో సహ చట్టం,హ్యుమన్ రైట్స్ కార్యకర్త వేయి మందితో సమానమని,ఎఫ్ ఆర్టీఐ లో ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులు,విద్యార్థి,యువజన,మహిళలు,కార్మికులు చేరుతున్నట్లు ప్రకటించారు.