టిడిపిలోకి బొప్పన భవ కుమార్

టిడిపిలోకి   బొప్పన    భవ కుమార్

టీడీపీ లోకి బొప్పన భవ కుమార్

విజయవాడ -జన చైతన్య (తమ్మిన గంగాధర్ )

విజయవాడ అధ్యక్షుడు బొప్పన భవ కుమార్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

 ఈ నెల గుడివాడ లో జరగనున్న చంద్రబాబు మీటింగ్ లో టీడీపీ లో చేరనున్నారని సమాచారం. 

ఈ నేపథ్యంలో  వంగవీటి రాధాకృష్ణ శనివారం భవ కుమార్ కార్యాలయానికి వెళ్లి రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలు, రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించారు.  కాగా భవ కుమార్ 2014 లో వైసీపీ కార్పొరేటర్ గా పనిచేశారు.  2019 లో విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు.

తరువాత నామినేటెడ్ పదవులు ఆశించి బంగపడ్డారు.

 భవ కుమార్ ను బుజ్జగించే క్రమంలో పార్టీ విజయవాడ నగర అధ్యక్ష పదవి ఇచ్చి శాంతింపజేశారు. నామినేటెడ్ పదవుల పంపకం విషయంలో తనకు అన్యాయం జరిగిందని భావించిన నాటి నుంచి ఒకింత కినుక వహించిన భవ కుమార్  పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం తగ్గించడంతో నగరంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వచ్చారు. 

ఈ క్రమంలో రాజకీయంగా మంచి భవిష్యత్తు కల్పిస్తామనే టీడీపీ భరోసాతో వైఎస్సార్సీపీ వీడుతున్నట్లు  తెలిసింది.