ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ను కలిసిన ప్రజా ప్రెస్ క్లబ్ సభ్యులు
ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ను కలిసిన ప్రజా ప్రెస్ క్లబ్ సభ్యులు
జనచైతన్య న్యూస్-తనకల్లు
సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం లో 24 జూన్ 2024 పట్టణ కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ను తనకల్లు ప్రజా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొండకమార్ల రెడ్డిబాషా,ఉపాధ్యక్షులు అధికారి శ్రీనివాసులు మరియు సభ్యలు కలిసి సోమవారం మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.అధ్యక్షులు మాట్లాడుతూ కందికుంట ప్రసాద్ గెలుపు కోసం గత దశాబ్ది కాలంపైగా వేచి చూశామని, 2024 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు సాధించాలని ప్రముఖ ప్రసిద్ధ శైవ వ లింగాలలో శివుని దర్శనం చేసుకుని మొక్కుబడి చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు సోమవారం కదిరి రోడ్లు భవనాల శాఖ ఇది గృహంలో కలిసి ఆయనకు అందించామని ఆయన కూడా ఆనందాన్ని వ్యక్తపరిచారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు షేక్ బాబ్జాన్, మస్తాన్ వలి,శ్రీనివాసులు, వాసు తదితరులు పాల్గొన్నారు.