పుట్లూరు మండలంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు
పుట్లూరు మండలంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు
జనచైతన్య న్యూస్-పుట్లూరు
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను గురువారం నిర్వహించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం విజయలక్ష్మి ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం హెచ్ఎం విజయలక్ష్మి మాట్లాడుతూ స్వాతంత్రం నా జన్మ హక్కు అని ఆచరణలో చూపిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు తెగువ పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులందరు పాల్గొనడం జరిగింది.