ప్రజా సంక్షేమమే జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం
ప్రజా సంక్షేమమే జగన్మోహన్ రెడ్డి లక్ష్యం : దేవినేని అవినాష్
విజయవాడ -జన చైతన్య (తమ్మిన గంగాధర్ )
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్, తారకరామా నగర్ కట్ట ప్రాంతాలలో గడప గడపకి తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ వెళ్లి ఈ నాలుగున్నర ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురుంచి వివరించడం జరిగింది.గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేకూర్చిన లబ్ధిని ప్రజలకు వివరిస్తూ వారిని పార్టీకి మరింత చేరువ చేయడమే లక్ష్యంగా గడప గడపకు "మీ అవినాష్ అన్న హామీ" కార్యక్రమం ద్వారా దేవినేని అవినాష్ కుటుంబ సభ్యలు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్,కనకదుర్గ నగర్ ప్రాంతాలలో దేవినేని సుధీర,14వ డివిజన్ పుట్ట రోడ్ ప్రాంతాలలో వై.సిద్దార్థ గార్లు గడప గడపకి వెళ్లి ఈ నాలుగున్నర ఏళ్లలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురుంచి వివరించడం జరిగింది .ఈ మూడేళ్ల కాలంలో అందించిన సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు మన ప్రభుత్వం వచ్చాక కలిగే మేలును వారికి వివరించి ప్రభుత్వ పనితీరు గురించి వారిని అడగగా తమకు జగన్ ప్రభుత్వం వచ్చాక చాలా మేలు జరుగుతుంది అని తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు.ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ ప్రతి గడపకు వెళ్లి లబ్ధిదారుల తలుపు తట్టి మరీ వారినీ ఆప్యాయంగా పలకరించి మన గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ మూడేళ్ల కాలంలో అందిస్తున్న సంక్షేమ ఫలాలను నేరుగా వారికి వివరించి,వారు పొందుతున్న లబ్ధిని గుర్తుచేస్తూ గతంలో ఎన్నడూ లేనివిధంగా తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక తమ ఇంట్లో అందరి మనిషి గా అందరినీ సాకుతున్నారని, మీకు అండగా నిలుస్తున్నారు అని తెలుపుతూ మీ అందరి ఆశీర్వాదాలు మన సీఎం జగన్ పై మన వైసీపీ ప్రభుత్వం పై ఎల్లవేళలా ఉండాలని, మంచి మనసుతో దీవించాలి అని అవినాష్అభ్యర్థించారు.ఆనాడు ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గడిచిన నాల్గు ఏళ్ళ కాలంలో కరోనా వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ సంక్షేమ పథకాలు అందజేసిన చరిత్ర ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్ కే దక్కిందన్నారు.గత ప్రభుత్వం లో గద్దె దత్తత తీసుకున్న అని ప్రకటన తప్ప అభివృద్ధి కి తీసుకొన్న చర్యలు ఏంటని ప్రశ్నించారు.ఇంకోసారి మీ రాజకీయ మనుగడ కోసం ప్రచార ఆర్భాటాల కోసం ప్రభుత్వాన్ని విమర్శిస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో 3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక,17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి,14వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య,కో అప్షన్ మెంబెర్ ముసునూరి సుబ్బారావు మరియు డివిజన్ ప్రెసిడెంట్లు,వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.