నగరాల విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ

నగరాల విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ
నగరాల విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ

శ్రీ నగరాలు ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన నగరాల కుల పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు , పుస్తకములు ,  పెన్నులు పంపిణీ  మరియు వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ ,  వస్త్రములు , దుప్పట్లు పంపిణీ కార్యక్రమం ఈరోజు శ్రీ నగరాలు సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం కళ్యాణ మండపం , చిట్టినగర్ నందు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి నరేంద్ర పాల్గొన్నారు. మేయర్ శ్రీమతి భాగ్యలక్ష్మి నరేంద్ర మాట్లాడుతూ గత 23 సంవత్సరాలుగా ఈ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాలు, పుస్తకములు మరియు వృద్ధులకు వృద్ధాప్య భృతి పంపిణీ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగటము సంతోషదాయకమని తెలియపరిచారు. ఈ సొసైటీ ఆధ్వర్యంలో అనేక మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి చక్కటి ఉద్యోగాలు పొంది విదేశాలలో కూడా చాలామంది స్థిరపడ్డారు. అందుకని ఈ సొసైటీ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా పాల్గొన్న  ప్రొఫెసర్ బాయన శంకర్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు తమకున్న అవకాశాలను అందిపుచ్చుకొని తమ భవిష్యత్తునకు బంగారు బాటలు వేసుకోవాలని , తాము చక్కటి ఉద్యోగాలను సాధించి తన కుటుంబంలో అందరికీ ఆసరాగా ఉండాలని, తమ సహాయ సహకారాలు అందించడం ద్వారా సమాజానికి కూడా సేవ చేసిన వారు అవుతారని తెలియపరిచారు.  వరల్డ్ బ్యాంకు డైరెక్టర్ బాయన వెంకట్రావు మాట్లాడుతూ తాను విద్యార్థి దశలో ఎంతో ఆర్థిక ఇబ్బందులతో కష్టపడి చదివి పైకి వచ్చి ఈరోజు ఇంత ఉన్నత స్థానంలో ఉన్నానని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఒక దృఢమైన సంకల్పంతో దృఢ నిశ్చయంతో తమ లక్ష్యాల్ని సాధించుకుంటానికి  కటోర  శ్రమను చేయవలసి ఉంటుందని, తద్వారా తమ లక్ష్యాల్ని సాధించుకొని తమ కుటుంబాలను ఆదుకుంటూ పదిమందికి ఆదర్శప్రాయముగా జీవన విధానాన్ని మలుచుకోవాలని తెలియజేశారు. ఈ సొసైటీ ద్వారా ఒక టెక్నికల్ టీం ను ఏర్పాటు చేసి విద్యార్థులకు వారికి ఉన్నటువంటి అవకాశాల గురించి వివరిస్తూ ఒక సహాయ సహకారాలు అందించడానికి ముందు ఉండాలని ,  ఆర్థిక సహకారంతోపాటు వారి కెరీర్ గైడెన్స్ కూడా సహకరించాలని కమిటీ వారికి సూచించారు. సొసైటీ అధ్యక్షులు లింగిపిల్లి రామకృష్ణ మాట్లాడుతూ ఈ సంవత్సరం 77 మంది విద్యార్థులకు ఉపకార వేతనంలు చెక్కులు , 96 మంది వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ చెక్కులు సొసైటీ ద్వారా మొత్తం మూడు లక్షల అరవై మూడు వేల రూపాయలను అందిస్తున్నామని తెలియపరిచారు. దాతలు సహాయంతో విద్యార్థులకు పుస్తకములు , వృద్ధులకు వస్త్రములు , దుప్పట్లు అందజేస్తున్నామని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి పిళ్ళా రవి , దేవస్థాన అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు , సొసైటీ అసోసియేట్ అధ్యక్షులు పిళ్ళా మోహన్ రావు , ఉపాధ్యక్షులు బెవర సూర్యనారాయణ ,  పిళ్ళా శ్రీనివాసరావు , రాంపిళ్ళ శ్రీనివాసరావు మాస్టారు , కుమారి పొతిన చంద్ర కీర్తి , రాయన ఆదిబాబు , పొట్నురి రమేష్  , N.V. రావు తదితరులు పాల్గొన్నారు.