శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల టిటిడి లో అంతర్జాతీయ యోగా దినోత్సవం

శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల టిటిడి లో అంతర్జాతీయ యోగా దినోత్సవం

శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల టిటిడి లో అంతర్జాతీయ యోగా దినోత్సవం

 జనచైతన్య న్యూస్-తిరుపతి

శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాల అధ్యక్షులు డా.సి.భువనేశ్వరి నేతృత్వంలో నిర్వహించడమైనది, ముందుగా ప్రిన్సిపాల్ విద్యార్థినిలను ఉద్దేశించి మాట్లాడుతూ వేదాలు, ఉపనిషత్తులు,భగవద్గీత, యోగ వాశిష్ట, పతంజలి,యోగ సూత్రాలు పురాణాలు ఇతిహాసాల్లో మనకు యోగవిద్య ప్రాముఖ్యత అగుపిస్తుందని ప్రస్తావిస్తూ వీరోచితకార్యం,తొనికి సలాడే జీవకళ, ఆశావాహ దృక్పథం, ఆరోగ్య లక్షణాలు, సద్గుణ ప్రకాశం ఇవన్నీ శక్తికి సంకేతాలని, అందుకే మనం ఉన్నంతవరకు దేహం, మనసు దృఢంగా ఉండాలని స్వామి వివేకానంద సూక్తిని ఈ సందర్భంగా తెలియజేశారు. జ్ఞానాన్ని ఆర్జిoచడంలో యోగాభ్యాసం ఎంతో ఉపకరిస్తుందని, యువతీ యువకుల్లో వృత్తి పరంగా ఎదురయ్యే మానసిక శారీరక సమస్యలకు యోగ సాధన తరుణోపాయాన్ని చూపుతుందని, యోగా అంటే కేవలం ఆసనాలు మాత్రమే కాదని క్రమశిక్షణ, ఏకాగ్రత ఇవన్నీ భాగమని క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డా సి స్వరాజ్యలక్ష్మి, తెలుగు ప్రాంత ప్రముఖ్ వివేకానంద కేంద్రం మారుతి మోహన్ రెడ్డి, కేంద్ర భారతి ప్రధాన కార్యదర్శి ధనుంజయరెడ్డి, నగర ప్రముఖ్ వివేకానంద, కేంద్రం లలిత, సురేంద్ర రెడ్డి మీరంతా విద్యార్థినిలను ఉద్దేశించి యోగా ప్రాముఖ్యతను తెలియజేసి, తదనంతరం విద్యార్థులతో యోగాసనాలు చేయించి, ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరిగినది. ఇందులో కళాశాల జాతీయ సేవా పథకం ఇంచార్జ్ డా జి శారద, విద్యార్థి సమాఖ్య సభ్యులు డా జయమ్మ, హాస్టల్ వార్డెన్ డా స్నేహలత, ఫిజికల్ డైరెక్టర్ సాయి సుమతి, అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.