వైసీపీని వీడిన సీనియర్ నాయకులు టిడిపిలో చేరిక

వైసీపీ ని వీడిన సీనియర్ నాయకులు టీడీపీ లో చేరిక
తిప్పేపల్లి పంచాయతీ లో 25 కుటుంబాలు వైసీపీని వీడి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో టీడీపీలోకి చేరిక.
ఓడిసి,మే (జనచైతన్య న్యూస్ ):-మండల పరిధిలోని తిప్పేపల్లి పంచాయతీకి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు టీడీపీ లోకి చేరిక పార్టీలో చేరినవారు సింగిల్ విండో మాజీ ప్రెసిడెంట్ ఉంట్ల మహేశ్వర్ రెడ్డి,మాజీ ఎంపిటిసి రఘునాథ్ రెడ్డి,ఉప సర్పంచ్ వెంకటస్వామీరెడ్డి మదన్మోన్మోహన్ రెడ్డి, రామచంద్రారెడ్డి ,లక్ష్మీపతిరెడ్డి ,రాఘవేంద్ర,జె,వెంకరామిరెడ్డి, వై,ఆదినారాయణ రెడ్డి, మందల మధు,సద్దా చలపతి తో పాటు పలు కుటుంబాలు వైసీపీని వీడి పుట్టపర్తి టిడిపి కార్యాలయంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,పుట్టపర్తి నియోజకవర్గంలో ఎన్.డి.ఏ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సిందూరరెడ్డి గెలుపు కోసం కష్టపడి పని చేసి గెలిపించుకంటామని తెలిపారు.రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వారు తెలిపారు భావి తరాల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ శెట్టి వారి జయచంద్ర మాజీ జెడ్పిటిసి పిట్టా ఓబుల్ రెడ్డి చుక్క బైరిశెట్టి నంది నరసింహులు బోనాల రామాంజి సున్నంపల్లి ఉపసర్పంచ్ నంది ఉత్తప్ప,హరిబాబు, తదితరులు పాల్గొన్నారు,