మినరల్ వాటర్ ప్లాంట్ లు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు

మినరల్ వాటర్ ప్లాంట్ లు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు

మినరల్దోపిడికూనపరాజుపర్వ గ్రామంలోప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న వాటర్ ప్లాంట్ వ్యాపారులు

విజయవాడ- జనచైతన్య (రుషిత్ కుమార్)

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్. 

ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కూనప రాజు పర్వ గ్రామంలో అక్రమ మినలర్ వాటర్ వ్యాపారం యథేచ్ఛగా జరుగుతోంది. ఆరోగ్యం పేరిట జనుల గొంతులో గరళం నింపేస్తున్నారు. గ్రామంలో కొండపల్లి సురేష్ అనే వ్యక్తి తన ఇంటి వద్ద ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా మరియు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా అక్రమంగా నిర్వహిస్తున్న త్రాగునీటి వాటర్ ప్లాంట్ నీరు త్రాగటం వల్ల గ్రామ ప్రజలు అనారోగ్యానికి గురై హస్పిటల్ పాలైపోతున్నారు అని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

వీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు. వీటిని తాగడం వల్ల కిడ్నీ సమస్యలు ఎదురవుతాయట. అంతేకాకుండా కిడ్నీల్లో రాళ్లు వస్తాయని చెబుతు ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఈ వాటర్ ప్లాంట్ ట్యాంకుల్లో నీరు నిల్వ ఉండి శుభ్రం చేయకపోవడం వల్ల పాకుడు పేరుకుపోయి నీటిలో పురుగులు వస్తున్నాయని కనీసం నీటిని శుభ్రపరచకుండా ట్యాంకుల్లో నింపి ఆటోల ద్వారా సరఫరా చేయటం వల్ల మా గ్రామం తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనారోగ్యపాలవుతున్నారు.గ్రామంలో నిబంధనలకు నీళ్లొదిలిన నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఒకప్పుడు బావులు, చెరువులు, నదుల్లో నీటిని తాగటానికి వినియోగించి ప్రజలు ఆరోగ్యంగా ఉండేవారు. ప్రస్తుతం కాలం మారి మినరల్‌ వాటర్‌ పేరుతో నీటి అక్రమాలు కనీవినీ ఎరుగని రీతిలో ఊపందుకున్నాయి. ప్రైవేటు కేంద్రాల నిర్వాహకులు శుద్ధి నీటి పేరుతో కాసుల వేటలో నిమగ్నమయ్యారు. ఫలితంగా ప్రజల ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రశ్నించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంతో వీరి ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో బీఐఎస్‌ అనుమతులు ఉన్న నీటిశుద్ధి కేంద్రాలు వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఇక రెడ్డిగూడెం మండలంలో అనుమతులు లేనివి లేకుండానే నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రజారోగ్యాన్నికాపాడుతామంటూ నీటిని శుద్ధి చేసి అందించే శుద్ధిజల కేంద్రాల ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిస్తూ నిబద్ధతతో చేయాల్సిన వ్యాపారంపక్కదారిపడుతోంది. దాదాపు హెచ్చు శాతం శుద్ధి కేంద్రాలు నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. 99 శాతం నీటిశుద్ధి కేంద్రాలు కనీస ప్రమాణాలను పాటించకుండా శుద్ధి చేయకుండానే నీటిని ఇంటింటికీ తిరుగుతూ క్యాన్లు, శీతల పానీయాల దుకాణాల వద్ద నీటి పొట్లాలను వివిధ రకాల పేర్లతో విక్రయిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదులు అందుతున్నా  పట్టించుకోవటం లేదనే విమర్శలూ ప్రజల నుంచి వస్తున్నాయి.. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు అసలు శుద్ధి చేయని నీటిని మినరల్‌వాటర్‌గా పేర్కొంటూ ప్రజల వద్ద నుంచి డబ్బులు దండుకుంటున్నారు. ఫలితంగా ప్రజలు లేని రోగాల బారిన డబ్బులు ఇచ్చి అనారోగ్య పాలవుతున్నారు. ఎదగాల్సిన చిన్న పిల్లల్లో క్యాల్షియం స్థాయి తగ్గిపోయి ఎముకలు బలహీన పడుతున్నాయి. లవణాలు తొలగించిన నీటిని రుచిగా మార్చేందుకు ఎసెన్స్ లాంటి రసాయనాలను మిశ్రమం చేసి ప్రజా ఆరోగ్యానికి ముప్పు తీసుకొస్తున్నారు. దీనివల్ల యువకుల్లో మోకాళ్ల నొప్పులు, ఎముకల నొప్పులు లాంటి సమస్యలు దీర్ఘకాలికంగా వెంటాడుతూ ప్రజా ఆరోగ్యానికి శాపంగా మారాయి. రెడ్డిగూడెం మండలంలో ఆర్వో వాటర్ ప్లాంట్ పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఈ కేంద్రాలు కనీస ప్రమాణాలను పాటిస్తున్నాయా అంటే మహా పాపమనే చెప్పాలి. నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఎస్‌ఐ) నిబంధనల మేరకు అనుమతులు పొంది ఉండాలి. నిబంధనలు ఉన్న శుద్ధి కేంద్రాలు ఎన్ని అంటే వేళ్లపై లెక్కేయచ్చని చెబుతున్నారు. అనుమతులు లేని కేంద్రాల్లో సరైన శుద్ధి విధానం అనుసరించడం లేదు. నీటి శుద్ధితో ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండానే ప్రజాఆరోగ్యంతోచెలగాటమాడుతున్నారు. చిరు వ్యాపారులు, హోటళ్లు ఎక్కువవడం, మధ్యతరగతి కుటుంబాలు శుద్ధి నీరు అంటూ క్యాన్లు కొనడంతో నీటి వ్యాపారం ఎక్కువైంది. ఫలితంగా మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వాహకులు ప్రజల ఆరోగ్యాన్ని పక్కన పెట్టి ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు.సాధారణంగా నీటిని శుద్ధి చేయాలన్నా.. మినరల్స్‌ను నీటిలో నిక్షిప్తం చేయాలన్నా  కొన్ని శాస్త్రీయ పద్ధతులున్నాయి. నీరు అనేది ప్రజలను ఆరోగ్యపరంగా నేరుగా ప్రభావితం చేసే అంశం కావడంతో ఎవరుపడితే వారు నీటిని శుద్ధి చేస్తామని ప్లాంటు పెట్టి నీటిని విక్రయించడానికి అవకాశం లేదు. ఆహార భద్రతా ప్రమాణాల చట్టం 2006 ప్రకారం అనుమతులు లేకుండా నీటిని శుద్ధి చేసి విక్రయించడం నేరం. అలాంటప్పుడు ఎలా అనుమతి లేని కేంద్రాల నీరు ప్రజల్లోకి వెళ్తున్నాయో.. అంతుపట్టని ప్రశ్నగా మిగులుతోంది. ఆరోగ్యం మోజులో పడిన జనం శుద్ధి చేసిన నీటిని తాగాలనే కుతూహలం నగర ప్రాంతాల నుంచి పట్టణ పరిధులను దాటుకుని పల్లెలకు సైతం విస్తరించింది. ఈ అవకాశాన్ని అదునుగా తీసుకున్న వ్యాపారులు ప్రజారోగ్యాన్ని పెట్టుబడిగా పెట్టి కాసులు వెనకేసుకుంటున్నారు. లేబుళ్లు లేని నీటి డబ్బాలు, లేబులు ఉన్నా.. కనిపించని కంపెనీ చిరునామా.. అన్నీ ఉన్నా.. మసకబారిన ముగింపు తేదీలు ఇలా ఒకటి కాదు అన్ని విధాలా ప్రజలను మోసం చేస్తున్నారు. ఎలాంటి శుద్ధి లేని నీటిని జనం అడిగి కొనుక్కోని మరీ తాగేస్తున్నారు. శుద్ధి కేంద్రాలు నీటిని తరలించడానికి వినియోగించే క్యాన్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. మినరల్‌ వాటర్‌ క్యాన్లలో ఫంగస్‌ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. క్యాన్ల అంచున పేరుకుపోయిన పదార్థం ప్రజల గుండెల్లో గుబులు రేపుతోంది. వ్యాపారులు క్యాన్లను శుభ్రం చేయకుండా ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు. బీఐఎస్‌ లైసెన్సులు లేని నీటి శుద్ధి కేంద్రాలపై ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో నీటి శుద్ధిలో ప్రమాణాలు కొరవడుతున్నాయి. బీఐఎస్‌ లైసెన్సులు ఉన్న వాటిని మాత్రమే పరిశీలించే అధికారం ఆహార భద్రతాధికారులకు ఉంది. అనుమతులు లేని వాటిపై నగర, గ్రామ పంచాయతీ, రెవెన్యూ శాఖలు నియంత్రణ కలిగి ఉంటాయి. ఈ శాఖలు ప్లాంట్ల వైపు కన్నెత్తి చూడటం లేదు. అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీఐఎస్‌ నిబంధనల ప్రకారం నీటిని అందించాలని, లేని పక్షంలో భవిష్యత్తులో ప్రజారోగ్యానికి ఇదొక పెనుముప్పుగా మారే అవకాశం లేకపోలేదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.  కూనపరాజు పర్వ  గ్రామంలో ఎటువంటి అనుమతులు లేకుండా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నీటిని శుద్ధి చేయకుండా ప్రజల ఆరోగ్యాలతో వాటర్ ప్లాంట్ నిర్వాహకులు చలగాటం ఆడుతూప్రజాఆరోగ్యానికి,ప్రాణానికిముప్పుతీసుకొస్తున్నారు.దీనివల్ల మోకాళ్ళ నొప్పులు, కిడ్నీ వ్యాధులు లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ధనార్జనే ధ్యేయంగా వ్యాపారం సాగిస్తున్న అక్రమ వ్యాపారులపై చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలు కాపాడాలని కూనపరాజు పర్వ గ్రామ ప్రజలు కోరుతున్నారు.