కాలం చెల్లిన వైసీపీకి చమర గీతం పలకండి
కాలం చెల్లిన వైసీపీకి చమర గీతం పలకండి.
పరమచెత్త ముఖ్యమంత్రి జగన్ ను ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించండి.
డబురువారి పల్లి లో వైసీపీకి గుడ్ బై చెప్పిన 40 కుటుంబాలు
మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకొని టిడిపిలోకి చేరిక
ఓడి చెరువు:05
వైసీపీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని ఆ పార్టీకి చమరగీతం పాడాలని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఓడి చెరువు మండలంలోని డబురువారి పల్లి లో శుక్రవారం నిర్వహించిన జయహో బిసి సమావేశంలో వైసీపీ నుంచి టీడీపీ పార్టీల్లోకి చేరిక సందర్భంగా అయన మాట్లాడారు. డబురు వారిపల్లి పంచాయతీలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ పడింది. సుమారు 40 వైసీపీ కుటుంబాలు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో టీడీపీలోకి చేరారు. పార్టీలోకి చేరిన వారికి టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అనేక సమస్యలపై ప్రభుత్వాన్ని అడిగిన పాపానికి వారిపై కేసులు పెట్టి వేధించారని పేర్కొన్నారు సుమారు 3500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు . ఏపికి 12 లక్షలు అప్పు భారం ప్రజలపై పెట్టిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్ రెడ్డి మాత్రమే అన్నారు.
రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి జరగలేదు రోడ్లు వేయలేదు నీళ్లు తీసుకురాలేదు పోలవరం కట్టలేదు మరి ఎందుకు అప్పులు పెరిగాయో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత జగన్ రెడ్డి పై ఉందన్నారు. ఏపీని మరో శీలంక గా జగన్ మార్చారని ఎద్దేవా చేశారు . ఇసుక మద్యం, కరెంట్ చార్జీల పెంపు, చెత్త పన్ను, ఆస్తి పన్ను ప్రజలపై భారం వేసి కోట్లాది రూపాయలు దోచేశారని వైసీపీ ప్రభుత్వం పై ఆయన మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు జగన్ రెడ్డి చెల్లికి తల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. సొంత చిన్నాన్నని చంపిన వ్యక్తులను దగ్గర పెట్టుకుని రక్షిస్తున్నాడని అలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదన్నారు.
*పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే ది అవినీతి చరిత్ర*
పుట్టపర్తి నియోజకవర్గ చరిత్రలో ఇలాంటి అవినీతి చరిత్ర కలిగిన ఎమ్మెల్యే ఎవరూ లేరని వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పై మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మండిపడ్డారు. ఎంతోమంది ఈ నియోజకవర్గాన్ని పాలించినప్పటికీ ఇలాంటి అరాచకాలు, దౌర్జన్యాలు ,అవినీతి చేసిన ఎమ్మెల్యే చరిత్రలో లేరన్నారు. వైసిపి ఎమ్మెల్యేను చిత్తుగా ఓడించి పుట్టపర్తి నియోజకవర్గ ఉమ్మడి టిడిపి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు సైకిల్ గుర్తుకు ఓటేయాలని ఆయన కోరారు వైసీపీ నుంచి టీడీపీకి చేరిన వారిలో ఎద్దుల శివారెడ్డి ఎద్దుల శంకర్ రెడ్డి అమిర్ భాష మహేష్ చెన్నకేశవరెడ్డి వెంకట్ రవీంద్రారెడ్డి లక్ష్మీనారాయణ రాజారెడ్డి శ్రీనివాసులు రవీంద్రారెడ్డి అప్పిరెడ్డి నరసింహారెడ్డి గోవింద్ రెడ్డి సూరి శివ తోపాటు పలు కుటుంబాలు టీడీపీలోకి చేరాయి. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ జయ చంద్ర, మాజీ జెడ్పీటీసీ పిట్టా ఓబుల్ రెడ్డి, జనసేన మండల కన్వీనర్ మేకల ఈశ్వర్, అమడుగూరు మండల కన్వీనర్ గోపాల్ రెడ్డి, సర్పంచ్ శంకర్ రెడ్డి ఎంపిటిసి శ్రీనివాసులు, మాజీ ఎంపీటీసీలు రాజారెడ్డి , పీట్ల సుధాకర్ ఆరిఫ్ ఖాన్, శివారెడ్డి, మీ సేవ సుధాకర్, గంటా శ్రీనివాస్, రామానాయుడు, అంజినప్ప,నాగరాజు , ఎద్దుల నారాయణ రెడ్డి , తెలుగు యువత అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి ,కరుణాకర్ రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామంజీ, సురేష్ ,జాకీర్ , జయచంద్ర రెడ్డి ,కొండే ఈశ్వరయ్య, గంగాధర్,చక్రధర్ , సూరి ,చంద్రశేఖర్ రెడ్డి , చౌట కిట్టప్ప, కంచి సురేష్ , నాగరాజు, శ్రీనివాసులు , అంజన్ రెడ్డి సాంబశివరెడ్డి నారపరెడ్డి, అబ్లు హుసేన్ రఘునాథరెడ్డి , జనసేన రామంజి ,మహిళ నాయకులు మస్తానమ్మ ,భాగ్యమ్మ ,పాలెమ్మ టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.