ఘనంగా ఐదు రోజుల పాటు శ్రీరామనవమి వేడుకలు:
ఘనంగా ఐదు రోజుల పాటు శ్రీరామనవమి వేడుకలు:
సత్యసాయి జిల్లా :అమడగూరు ఏప్రిల్ 19:జనచయితన్య న్యూస్ :మండలంలోని కందుకూరిపల్లి, లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు ఐదు రోజులపాటు నిర్వహిస్తున్నట్టు గ్రామపెద్దలు తెలిపారు, ఈ ఐదు రోజులు ప్రతిరోజు కోలన్న, చెక్కభజన, వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు, గ్రామ ప్రజలు సుబిక్షంగా, ఉండాలని ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహిస్తారు,పూజలు అనంతరం ఘనంగా ఊరేగింపు జరుగుతుందని, తీర్థ, అన్నప్రసాదాలు, నిర్వహిస్తారని గ్రామ పెద్దలు ప్రజలు తెలిపారు,ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ప్రతిఒక్కరు భాగస్వాములు అవుతారని తెలిపారు