ఘనంగా పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకలు :-
ఘనంగా పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకలు:-
ఓ.డి.చెరువు మే(జనచైతన్య న్యూస్)ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు తెలంగాణ రైతంగా సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు కమ్యూనిస్టు గాంధీ గా పేరొందిన,కుల వ్యవస్థను నిరసించిన సుందరయ్య అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి, రెడ్డి అనే సూచికలను తొలగించుకుని సుందరయ్య గా సామాన్య వ్యక్తిలా మారి నిరాడంబరంగా జీవితం గడిపాడు, పార్లమెంటు సభ్యునిగా ఉండి సైకిల్ మీద పార్లమెంటు కి వెళ్లేవాడు, తెలంగాణ సయుద పోరాట రథసారథి, సుందరయ్య పోరాటం చేసారు, అలాంటి నాయకున్ని స్మరించుకుంటూ, మండలంలో 39 వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో సి.పి.యమ్. నాయకులు వి.వి.రమణ, శ్రీరాములు, కుళ్లాయప్ప,అంజి,చంద్ర, శ్రీనివాసులు,తదితరులు పాల్గొన్నారు