సుజనా చౌదరి జోరులో మమేకమైన భవానిపురం కాలనీవాసులు
సుజనాజోరు కాలనీలు- అపార్ట్‌మెంట్ వాసులతో మమేకం
విజయవాడ-జన చైతన్య (తమ్మిన గంగాధర్)
పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రజలతోమమేకమవుతున్నారు. ఓవైపు ఇంటింటి ప్రచారం చేస్తూనే,ఇంకోవైపుకాలనీలు.అపార్ట్‌మెంట్వాసులతోసమావేశమవుతున్నారు. పశ్చిమకు తానెంత అవసరమో, తనను ఎందుకు గెలిపించాలో వివరిస్తున్నారు. తనకు ఓటు వేయాలని కోరుతున్నారు. మంగళవారం కుమ్మరిపాలెం కౌస్తుభ నివాస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరీష్ బండారి, వైస్ ప్రెసిడెంట్ అప్పన సాయిబాబు, సెక్రటరీ కిరీటి జైన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
దేశంలో, ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఏర్పాటవుతాయని జోస్యం చెప్పారు. ఎమ్మెల్యే గా తనను గెలిపించిన పక్షంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో, ఏపీ ప్రభుత్వ మద్దతుతో నియోజకవర్గం అభివృద్ధికి నిధులుసాధించుకోగలుతామని చెప్పారు. తనకు మద్దతు తెలిపిన కౌస్తుభ నివాస్ అపార్ట్ మెంట్ వాసులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు పచ్చిపులుసు వెంకట శివప్రసాద్, బీజేపీ నాయకులు శ్రీరామ్, పీయూష్ దేశాయ్, మైనారిటీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ జైన్, రాజు , సోలంకి తదితరులు పాల్గొన్నారు.