రైతు భరోసా కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే వేరుశనగ విత్తన పంపిణీ

రైతు భరోసా కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే  వేరుశనగ విత్తన పంపిణీ

రైతుబరోసా కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే వేరుశనగ విత్తన పంపిణీ :-

ఓ.డి.చెరువుమే(జనచైతన్య న్యూస్)మండలకేంద్రంలో గల రైతులు 20/05/2024 నుండి వేరుశనగ విత్తన పంపిణీ రిజిస్ట్రేషన్ కొరకు రైతులు వారి పరిధి లోని రైతుభరోసా కేంద్రం నందు సంప్రదించాలి అని మండల వ్యవసాయ అధికారి తెలిపారు,మొదటగా విత్తనం కొరకు రిజిస్ట్రేషన్ చేస్కున్న రైతులకి మాత్రమే విత్తనం అందజేయడం జరుగుతుంది రైతులు తమ వెంట పట్టాదారు పాసుపుస్తకం,ఆధార్ కార్డు,మొబైల్ ఫోన్ కచ్చితంగా తీసుకొని వెళ్ళాలి అని సూచించారు, 0-05 ఎకరాలు ఉన్న రైతుకు 30 కేజీల బ్యాగ్ ఒకటి,0.5- 1.0 ఎకరాలు ఉన్నా రైతుకి 30 కేజీల బ్యాగులు రెండు,1.01 ఎకరాల పైనున్న వారికి 30 కేజీల బ్యాగులు 3 పంపిణీ చేస్తారు, K-6 మరియు TCGS - 1694 రకం విత్తనానికి సంబంధించి 30 కేజీల 1 బ్యాగ్ పూర్తి ధర రూ.2,850 ఉండగా, అందులో సబ్సిడీ 1,140 రూపాయలు పోగా రూ.1,710 చెల్లించాలి.K-6 మరియు TCGS - 1694 రకం విత్తనానికి సంబంధించి 60 కేజీల 2 బ్యాగ్ ల పూర్తి ధర రూ.5,700 ఉండగా,అందులో సబ్సిడీ 2,280 రూపాయలు పోగా రూ.3,420 చెల్లించాలి.K-6 మరియు TCGS - 1694 రకం విత్తనానికి సంబంధించి 90 కేజీల 3 బ్యాగ్ ల పూర్తి ధర రూ.8,550 ఉండగా,అందులో సబ్సిడీ 3,420 రూపాయలు పోగా రూ.5,130 చెల్లించాలి.కదిరి లేపాక్షి (కె -1812) రకం విత్తనానికి సంబంధించి 30 కేజీల 1 బ్యాగ్ పూర్తి ధర రూ.2,610 ఉండగా, అందులో సబ్సిడీ 1,044 రూపాయలు పోగా రూ.1,566 చెల్లించాలి. కదిరి లేపాక్షి (కె - 1812) రకం విత్తనానికి సంబంధించి 60 కేజీల 2 బ్యాగుల పూర్తి ధర రూ.5,220 ఉండగా, అందులో సబ్సిడీ 2,088 రూపాయలు పోగా రూ.3,132 చెల్లించాలి.90 కేజీల 3 బ్యాగుల పూర్తి ధర రూ.7,830 ఉండగా, అందులో సబ్సిడీ 3,132 రూపాయలు పోగా రూ.4,698 చెల్లించాలి అని మండల వ్యవసాయ అధికారి తెలిపారు.