సంపూర్ణ ఆరోగ్యం యోగ తోనే సాధ్యం:-

సంపూర్ణ ఆరోగ్యం యోగ తోనే సాధ్యం:-

సంపూర్ణ ఆరోగ్యం యోగ తోనే సాధ్యం :-

ఓ.డి.చెరువు (జనచైతన్య న్యూస్) జూన్ :-మండలంలోని రెయిన్బో ఎడ్యుకేషనల్ అకాడమీ స్కూల్ నందు అంతర్జాతీయ యోగ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా బీజేపీ కిసాన్ మోర్చా ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి హాజరయ్యారు, వారిని స్కూల్ కరస్పాండెంట్ జయసింహా రెడ్డి మర్యాద పూర్వకంగా ఆహ్వానం పలికారు వారు మాట్లాడుతూ

మన భారత ప్రధాని నరేంద్ర మోదీ యోగ దినోత్సవం కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నారని 177 దేశాలు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఏమోదించడంలో ముఖ్య పాత్ర పోషించారని తెలిపారు, ప్రతి సంవత్సరం జూన్ 21 న అంతర్జాతీయ యోగ దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. యోగ ద్వారా శారీరక,మానసిక, ఆధ్యాత్మిక,ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయాన్నారు, యోగ అంటే శారీరక శ్రమ మాత్రమే కాదని మనలో ఉన్న ఆందోళన, ఒత్తిడి ని దూరం చేస్తాయని విద్యార్థులు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కనీసం 20నుండి 30 నిముషాలు పాటు యోగ చేసే విధంగా అలవరచుకోవాలని యోగ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని తెలిపారు. రెయిన్బో ఎడ్యుకేషనల్ అకాడమీ కారస్పాండెంట్ యమ్.జయసింహా రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్ధికి చదువుతో పాటు చురుకుగా ఉండేందుకు వ్యాయామం, క్రీడలు లాంటి కార్యక్రమాలు ప్రతిరోజు జరుపుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సి. రంగారెడ్డి యువ నాయకులు కే.సురేష్,యన్.మురళి స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.