తలుపుల మండలంలో రెపరెపలాడుతున్న పసుపు జెండాలు టిడిపి,బిజెపి,జనసేన

తలుపుల మండలంలో రెపరెపలాడుతున్న  పసుపు జెండాలు టిడిపి,బిజెపి,జనసేన

తలుపుల మండలంలో రెపరెపలాడుతున్న పసుపు జెండాలు టిడిపి,బిజెపి,జనసేన

జన చైతన్య న్యూస్- తలుపుల 

సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలంలో స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజానీకం భారీ బైక్ ర్యాలీ, వేలాదిగా తరలివచ్చిన ప్రజలు, టిడిపి శ్రేణులు సైకో పోవాలి. సైకిల్ రావాలంటు నినాదాలు చేసిన టిడిపి శ్రేణులు కందికుంటకు భారీ గజమాలతో ఘన స్వాగతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై మండిపడుతున్న యువత కూతవేటు దూరంలో ముఖ్య మంత్రి ఉన్న తలుపులకు చేసింది.శూన్యమని ఆవేదన వ్యక్త పరుస్తున్న తలుపుల మండల ప్రజలు తలుపులకు కృష్ణ జలాలు తరలిస్తామని బూటకపు హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి సాగు, త్రాగునీరుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తలుపుల ప్రజానీకం ఆవేదన రైతన్నలను నిలువున ముంచేసిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో తమ తడాఖా ఏమిటో చూపిస్తామని హెచ్చరిస్తున్న అన్నదాతలు అన్నదాతల ఉసురు తగిలితే నామరూపాలు ఉండవు. తలుపుల వైసీపీ చేసింది,శూన్యం జగన్ నమ్మి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజలు జగన్ బూటకపు హామీలు నమ్మి మోసపోయామని యువత మండిపాటు ఒక్క ఛాన్స్ తో రాష్ట్రం సర్వనాశనం ప్రజల మధ్య ఉండే నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ ప్రజలకు కష్టనష్టాల్లో పాలుపంచుకున్న ఒకే ఒక నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ ఓటు వేసి రుణం తీర్చుకుంటామని శపథం చేస్తున్న ఓటర్లు కందికుంట వెంకటప్రసాద్ ను అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్న తలుపుల మండల ప్రజలు వైసీపీ నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో మోసపోయిన యువత, రైతు, కార్మికులు, కూలీలు, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాల ప్రజలు కదం తొక్కుతున్నారు. వైసీపీని సాగనంపడానికి నడుం బిగించారు. కష్టం నష్టం వచ్చిన వైసీపీ నాయకులు బెదిరించిన లెక్కచేయకుండా స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. నియోజవర్గంలోని తలుపుల మండల కేంద్రంలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో రాలనంత జనం ఎక్కడ చూసినా పసుపు జెండాలు, పెద్ద ఎత్తున యువత ,రైతన్నలు, టిడిపి శ్రేణులు, ప్రజలు వచ్చారు,తలుపుల మండల కేంద్రం జనసంద్రంగా మారింది. ఉత్సాహంగా పాల్గొన్న యువత తమ భవిష్యత్తు చంద్రబాబు నాయుడు తోనే సాధ్యమని సైకో పోవాలి సైకిల్ రావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్వచ్ఛందంగా తరలివస్తున్న ప్రజానీకం చూసి వైసిపిని బొంద పెట్టడానికి ప్రజలందరూ సిద్ధమయ్యాపోయారని చర్చించుకుంటున్నారు, సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండంతో శ్రీ సత్య సాయి జిల్లా కదిరి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు, శుక్రవారం నియోజకవర్గంలోని తలుపుల మండలంలో టిడిపి శ్రేణులు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు,ర్యాలీలో కందికుంట వెంకటప్రసాద్ హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బి కే పార్థసారధి పాల్గొన్నారు,తలుపుల మండలంలోని బట్రేపల్లి నుండి మండల కేంద్రం వరకు దాదాపు ఆరు కిలోమీటర్లు బైక్ ర్యాలీ చేపట్టారు,అనంతరం రోడ్ షో నిర్వహించి మండల కేంద్రంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు, మండల వ్యాప్తంగా టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు, టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ కు బట్రేపల్లి, తలుపుల లలో భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు, టిడిపి శ్రేణులు సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు,జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని తలుపుల ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేశారు. మండలానికి కృష్ణా జలాలు తీసుకొస్తామని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి తెలిపాడని నేటికీ హామీని నిర్వర్తించలేదని ఆరోపించారు, పక్కనే పులివెందుల నియోజవర్గం ఉన్నప్పటికీ తలుపుల మండలానికి ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి చేసింది శూన్యమని ఆరోపించారు,త్రాగు ,సాగు నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు,ఒక్క ఛాన్స్ అని ప్రజలను ప్రాధేయపడి అధికారంలోకి వచ్చిన జగన్ అధికారం చేపట్టిన తర్వాత విశ్వరూపం చూపించారని విమర్శలు గుప్పించారు, యువత, నిరుద్యోగులు, రైతన్నలు అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో కందికుంట వెంకట ప్రసాద్ ను గెలిపించుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు.