కలకత్తాలో జూనియర్ డాక్టర్ మౌనిత హత్యకు నిరసనగా పొదిలి పట్టణంలో శాంతి ర్యాలీ
కలకత్తాలో జూనియర్ డాక్టర్ మౌనిత హత్యకు నిరసనగా పొదిలి పట్టణంలో శాంతి ర్యాలీ
జనచైతన్య న్యూస్-పొదిలి
ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం లోని పొదిలి మండలంలో ఆగస్టు 9వ తేదీన పీజీ వైద్య విద్యార్థి డాక్టర్ మౌనితను కలకత్తా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ హాస్పటల్ నందు సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్ అత్యంత కిరాతకంగా రేప్ చేసి హత్య చేసినందుకు, నిరసనగా పొదిలి పట్టణంలో మానవతా సేవా స్వచ్ఛంద సంస్థ, ఆర్ ఎం పి,పి ఎం పి అసోసియేషన్లు,ప్రభుత్వ వైద్యాధికారులు,ప్రభుత్వ వైద్య సిబ్బంది,పొదిలి పట్టణ విద్యావేత్తలు,మేధావులు ఆధ్వర్యంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ ఎస్పీ బాలయ్య,బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బెల్లంకొండ విజయలక్ష్మి,ఎస్వీకేపీ డిగ్రీ కాలేజీ అధినేత,బిజెపి నాయకులు మువ్వల పార్థసారధి,సాహితీ రాయల్, శ్రీ జి సి సుబ్బారావు,విశ్రాంత విద్యాశాఖాధికారి కె యల్లమంద రెడ్డి,బిట్స్ కాలేజీ అధినేత డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు తదితరులు ప్రసంగిస్తూ సివిల్ వాలంటర్ సంజయ్ రాయ్ ఆగస్టు 9వ తేదీన కలకత్తా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో డాక్టర్ మౌనితను అత్యంత కిరాతకంగా రేప్ చేసి హత్య చేస్తే,ఇంతవరకు నిందితులపై చర్యలు తీసుకోకపోవడం చాలా దుర్మార్గమని,ఒక వైపు సివిల్ వాలంటీర్ సంజయ్ రాయి నేనే అత్యాచారం చేశాను, కావాలంటే నన్ను ఉరి తీసుకోండి.అంటూ హేలనగా చులకనగా మాట్లాడుతున్నా ఇంతవరకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎందుకు నోరు మెదపకుండా మొద్దు నిద్ర పోతుందన్నారు,అని ప్రశ్నించారు.పీజీ వైద్య విద్యార్థి డాక్టర్ మౌనిత అక్కడి హాస్పటల్లో జరుగుతున్న సెక్స్ రాకెట్,ఆర్గాన్ ట్రేడ్,డ్రగ్ మాఫియా బయటపెట్టినందులకు ఆమెను అత్యంత కిరాతకంగా రేప్ చేసి,హత్య చేయించారని,దీని వెనుక అక్కడి ప్రభుత్వ పెద్దల పాత్ర తప్పకుండా ఉంటుందని,వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. మణిపూర్ సంఘటనపై గగ్గోలు పెట్టిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈ విషయములో ఎందుకు నోరు మెదపటం లేదన్నారు,నిందితులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించి,బాధిత కుటుంబానికి తగు న్యాయం చేకూర్చి, వైద్యులకు పూర్తి రక్షణ కల్పించాలన్నారు,ఈ కార్యక్రమంలో సానికొమ్మ శ్రీనివాసరెడ్డి,ఆర్ఎంపి వైద్యులు డాక్టర్ ఎస్ డి ఇమాంసా, లక్ష్మీ నారాయణ,శ్రీ కాశయ్య,భాస్కర్,యక్కలి శేషగిరిరావు,కల్లం సుబ్బారెడ్డి,శామంతపూడి నాగేశ్వరరావు,తానికొండ వెంకట్రావు, వరికూటి శిరీష, మెహ్రూన్నీసా, కిరణ్మయి, బండి అశోక్,శ్రీ బాజీ, గూడూరి వినోద్,మేధావులు,విద్యావేత్తలు తదితరులు ఈ శాంతి ర్యాలీలో పాల్గొని తమ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.