రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం చంద్రబాబు తోనే సాధ్యం

రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం చంద్రబాబు తోనే సాధ్యం

రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం చంద్రబాబు తోనే సాధ్యం

జనచైతన్య న్యూస్- బుక్కరాయసముద్రం

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలంలో సిద్ధరాంపురంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి సోమవారం పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం తన స్వ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే కు స్థానికులందరూ ఘన స్వాగతం పలికారు. గ్రామంలో నాయకులతో కలిసి పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి మాట్లాడుతూ స్వగ్రామంలో పింఛన్లు అందించడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు మేరకు పింఛన్ల మొత్తాన్ని పెంచారన్నారు.అంతేకాకుండా ఒక్క అవకాశం పేరుతో అధికారంలో వచ్చిన జగన్ రెడ్డి మాట తప్పి విడతల వారిగా పింఛన్లు పెంచితే ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు ఒకేసారి  వెయ్యి రూపాయలు పెంచారని ఇచ్చిన హామీని నెరవేర్చడం ఒక్క ఎన్డీఏ కూటమి కే దక్కుతుందనన్నారు .ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు , మహిళలు,కార్యకర్తలు అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.