క్యాబినెట్ దృష్టికి నందమూరి నగర్ ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్య

క్యాబినెట్ దృష్టికి నందమూరి నగర్ ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్య

కేబినెట్ దృష్టికి నందమూరి నగర్ ఇళ్ల రిజిస్ట్రేషన్ల సమస్య

విజయవాడ _ జనచైతన్య (తమ్మిన గంగాధర్)

రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

దశాబ్ధాలుగా నందమూరినగర్ వాసులు ఎదుర్కొంటున్న ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారానికి కేబినెట్ ఆమోదం తెలపడం శుభపరిణామని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఈ మేరకు ఆయన కార్యాలయం బుధవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. నందమూరి నగర్లో దాదాపు 70 కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నట్లు ఈ సందర్భంగా మల్లాది విష్ణు గుర్తుచేశారు. సమస్యను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతోనే ఆయన స్పందించిన తీరు హర్షణీయమన్నారు. అంశంపై మంత్రివర్గ సమావేశంలో (ఐటమ్ నెంబర్ 29) సుధీర్ఘంగా చర్చించి.. ఆమోదం తెలపడంతో సమస్యకు పరిష్కారంలభించినట్లయిందని తెలిపారు. త్వరలోనే వీరందరికీ హక్కుతో కూడిన పట్టా అందజేయనున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి నగరంలో ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్ల సమస్య శాశ్వత పరిష్కారానికి దృఢ సంకల్పంతో పనిచేస్తున్నట్లు ఉద్ఘాటించారు. పేదలకు, బడుగు, బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.