ఆడ బిడ్డలకు రక్షణ కల్పించలేని పాలకులను పాతరెద్దాం. రండి కదలి రండి
ఆడ బిడ్డలకు రక్షణ కల్పించలేని పాలకులను పాతరెద్దాం. రండి కదలి రండి
రాజమండ్రి-జనచైతన్య న్యూస్
రాజమండ్రిలో నేరగాళ్ళను పెంచి పోషిస్తున్న వారే పాలకులుగా చలామణి అవుతున్నారు.అక్రమాలను ప్రశ్నించినా,అందుకోసం పోరాడినా అక్రమ కేసులుతో వేధింపులు తప్పవు,యువతను బానిసలుగా మారుస్తున్నారు,కాదంటే హింసిస్తున్నారు, అఘాయిత్యానికి గురయ్యాకనో,అ దాడిలో చనిపోయాకనో మన పాలకులు స్పందిస్తున్నారు.మేడా శ్రీనివాస్,ఆవేదన,రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్,ప్రతి మహిళకు 100% భద్రత కల్పిస్తాం,అందుకు మాకు దమ్ము నిజాయితీ వుంది.బిడ్డల భవిష్యత్ కోసం నిజాయితీగా ఓటు హక్కు వినియోగించుకునే దైర్యం మీకు వుందా ! అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్తాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సూటిగా అడిగారు,ఆడబిడ్డ జన్మిస్తే భారతదేశంలోనే పుట్టాలి, పెరగాలి అని ప్రపంచ దేశాలు అనుకుంటుంటే భారత్ పాలకులు మాత్రం భారతీయ మహిళకు భద్రత లేకుండా చేస్తున్నారు. చిన్నపిల్ల నుండి చివరకు వృద్దురాలి పై కూడా మానవ మృగాల వలే విరుచుకు పడుతు సామాజిక ఉన్మాదుల వలే బరితెగిస్తున్నారు, ఇలాంటి మానవ పశువులకు భారతదేశంలో నేటి ప్రస్తుత వ్యాపార, కార్పొరేట్ రాజకీయ పార్టిలు వెనుక నుండి అండగా నిలుస్తున్నారని, అఖండ భారతదేశంలో స్త్రీ మూర్తికి ఎంతో గౌరవ ప్రతిష్టలు ఆనాడు నాడు వుండేవని,నేడు అందుకు భిన్నంగా రాక్షస కీచకులు, రావణాసురుడు సంతతికి చెందిన పాలకులు రాజ్య మేలుతున్నారని,మన అసెంబ్లీ ,పార్లమెంట్ లో కేవలం 5% మాత్రమే పవిత్రులు,సంఘ సేవకులు వున్నారని,మన ఎన్నికల విధి, విధానాలు ప్రజాస్వామ్య బద్దంగా కాకుండా,పశుస్వామ్యంగా నిర్వహిస్తు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని,మన చట్ట సభల్లోకి జాతీయ జెండాను గౌరవించని వారికి,భారత రాజ్యాంగం పట్ల గౌరవ బావం లేని వారికి,మహిళల పై అఘాయిత్యాలకు తెగబడే వారికి,అతి పెద్ద ఆర్ధిక నేరగాళ్లకు,సంఘ విద్రోహులకు, ఎన్నికల నియమావాళికి భిన్నంగా వ్యవహరించే వ్యాపార, కార్పొరేట్,రాజకీయ పార్టి లకు పూర్తి స్థాయిలో కొమ్ము కాస్తు సామాజిక భద్రతకు తూట్లు పొడుస్తున్నారని,ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ప్రవర్తించే రాజకీయ పార్టీలను వేదిస్తు ప్రజాస్వామ్యాన్ని ప్రమాద కర పరిస్థితులకు దారి చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.నేటి సమాజంలో నేరగాళ్లు ఎవరో పాలకులు ఎవరో తెలియటం లేదని,పాలనా ముసుగులో బాధితులకు సానుభూతి కనపరుస్తు మరో ప్రక్క నేరస్తులకు అధికారాన్ని , అనదికారాన్ని అండగా నిలపెడుతున్నారని,ఈ మధ్య అధికారాన్ని అనుభవిస్తు కూడా బాధితులకు న్యాయం జరగాలి అంటు పాలకులే కొత్త నాటకాలతో రక్తి కట్టిస్తున్నారని, కలకత్తాలో జరిగిన ఘోర పాశవిక హత్య కావొచ్చును, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా,మహారాష్ట్రా లో జరిగిన మహిళా హత్యలు,పసి పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు కావొచ్చును,అన్నింటికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అధికార దుర్వినియోగంతో బాటుగా వారి రాజకీయ సొంత స్వార్ధ ప్రయోజనాలే ప్రధాన కారణం అని,నేటి పాలకులు కపట సానుభూతి రాజకీయాలతో నీచ రాజకీయాలకు తెర లేపుతూ సామజిక విష కాలుష్యానికి కారకులవుతున్నారని,నేటి పాలకులు ఒకరకమైన కుట్ర కోణంలో ఓటును సైతం ఓటరు ప్రమేయం లేకుండానే కైవసం చేసుకుంటున్నారని,గెలిచిన తరువాత వారి శ్రమను దోచుకుంటున్నారని,ఎన్నికల్లో ఖర్చు చేసిన సొమ్ముకు బదులుగా లక్షల కోట్లు ప్రజల నుండి వివిధ మార్గాల ద్వారా పాలనను అడ్డు పెట్టుకుంటు దోచుకుంటున్నారని,ప్రజా ఆగ్రహం పెల్లుభీక కుండా ప్రతి మనిషిలో ఒక రకమైన కుత్రిమ వైరస్ లను చొచ్చు బిచ్చి మనిషి శక్తిని కుట్ర పూరితంగా నిర్వీర్యం చేస్తున్నారని, నేడు మనుషుల్లో పట్టుమని 5 గంటలు నిరశన తెలపగలిగే శక్తి కూడా లేకుండా కలుషిత ఆహరాన్ని ప్రజల దరికి చేరుస్తున్నారని, నాణ్యమైన ఆహారాన్ని భారతీయులకు అందకుండా ఆ నాటి బ్రిటిష్ వ్యూహలను అమలు చేస్తున్నారని,మన ప్రజాస్వామ్యం నేటి కార్పొరేట్ శక్తుల కబంద హాస్థాల్లో బానిసగా బంది కాబడిందని , ఒకప్పుడు యుద్దాలు ఎదురుగా వుండేవని, నేడు మనం తీసుకునే ఆహరమే శత్రువుగా మారిందని,పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తుల చేతుల్లో దురాశతో చిక్కుకుపోయారని,నేటి పౌరులు అక్రమాలను ప్రశ్నించకుండా,ప్రజా ఉద్యమాలను నడిపించకుండా,మన కళ్ళ ముందే మన బిడ్డల జీవితాలను బూడిద చేస్తున్నారని,మన బిడ్డల జీవితాలు కళ్ల ముందే ఆవిరై పోతున్నాయని,ఆడ బిడ్డల జీవితాలు బుగ్గి పాలవుతున్నా ఎదిరించలేని,ప్రశ్నించలేని మైదాన ముసళ్ల జీవితాలుగా మన పాలకులు మనల్ని మార్చేస్తున్నారని,భయపెడుతున్నారని ఆయన తీవ్ర మనస్థాపానికి గురైయ్యారు.తప్పులను, అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నించినా,అందుకోసం పోరాడినా మన రాజకీయ నేరస్తుల బెదిరింపులుతో పాటుగా పాలకుల వేధింపులు తప్పవు అన్నట్టు పౌర హక్కులను బెదిరింపులతోకాలరాస్తున్నారు.పిర్యాదు కు స్పందన ఉండదు,న్యాయం ఖరీదైనదిగా మారిపోయింది, ప్రభుత్వ కార్యాలయాలు అవినీతి కూపంగా శాసిస్తున్నాయి, మరి భాదితులకు రక్షణ ఎక్కడ దొరుకుతుంది,న్యాయం అస్సలు దొరుకుతుందా,అని ప్రజలు నిరాశ తోను,ఆందోళన తోను,మానసిక వేధింపుల తోను బ్రతకాల్సిన దుస్థితిలో జీవించాల్సిన ఖర్మ ప్రజలను నిత్యం వెంటాడుతుందని,స్వాతంత్య్రనికి ముందు బానిసలుగానే బ్రతికాము,స్వాతంత్య్రం అనంతరము బానిసలుగానే బ్రతుకుతున్న ఏకైక పౌరులు ప్రపంచం మొత్తంలో భారతీయులేనని,మన పాలకులు యువతను బానిసలుగా మార్చేస్తున్నారని,కాదంటే హింసిస్తున్నారని,మహిళలు అఘాయిత్యానికి గురయ్యాకనో, జరిగిన దాడిలో మరణించాకనో పాలకులు సానుభూతి రాజకీయం చేసే పాలకులనే నేడు మనం చూస్తున్నామని,నేర సంఖ్యను తగ్గించ గల నిజాయితీ పాలకులు నేడు లేకపోయారని,మహిళలకు 100% భద్రత,మంచి భవిష్యత్ కల్పించ గల దమ్ము, దైర్యం మాకు మాత్రమే వుందని,నిజాయితీగా ఏ బలహీనతలకు తావులేని విధంగా ఓటు హక్కు వినియోగించుకునే ఆదర్శం ఓటర్లకు వుందా ! అని, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ కు ప్రజలు అధికారం అప్పగించిన నాడే సామాజిక భద్రత,మహిళలకు 100% భద్రత,మానవ హక్కులకు శాశ్వత రక్షణ, పేదరికం లేని సంపద,అంటరాని తనం లేని ఆత్మగౌరవ సమాజం అందరికి సొంతం అవుతుందని,ప్రస్తుత వ్యాపార,కార్పొరేట్ రాజకీయ పార్టీలను నమ్మినన్నాళ్ళు మన బిడ్డల భద్రత కానరాదనే నిజాన్ని మన ప్రజలు గుర్తించి ఆ పార్టిలను భహిష్కరించాలని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తెలిపారు.ఈ సభకు అర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు,ఈ సమావేశంలో అర్పిసి సెక్యూలర్స్ సర్వశ్రీ డి వి రమణ మూర్తి,దూడ్డే సురేష్ ,వర్ధనపు శరత్ కుమార్, దోసి నిశాంత్,దూడ్డే త్రినాద్,సుంకర వెంకట భాస్కర రంగారావు,అడపా శేషగిరి,కేతా అప్పారావు, జేఈ శ్రీయ,పిట్టల శ్రీనివాస్ తదితరులు పాల్గొనియున్నారు.