అంతర్ జిల్లావాహన దొంగలనుఅరికట్టిన _ జిల్లా ఎస్పీ అద్నాన్ నయిమ్

అంతర్ జిల్లావాహన దొంగలనుఅరికట్టిన _ జిల్లా ఎస్పీ అద్నాన్ నయిమ్

కృష్ణాజిల్లా తోట్లవల్లూరు

అంతర్ జిల్లాలలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తుడి ఆటలకు చెక్ పెట్టిన- జిల్లాఎస్పీ            అద్నాన్  నయీమ్ 

విజయవాడ- జనచైతన్య (తమ్మిన గంగాధర్ )

తోట్లవల్లూరు పోలీసులు

నిందితుని వద్ద 20 లక్షల విలువైన 37 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

విలేకరుల సమావేశంలో కేసు పూర్వాపరాలు వెల్లడించిన కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి ఐపీఎస్ 

విలాసాలకు అలవాటు పడి సులభ సంపాదన మోజులో అంతర్ జిల్లాలలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతూ వాటిని విక్రయిస్తున్న ముఠాను ఈరోజు తోట్ల వల్లూరు పోలీసులు చాకచక్యంగా అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుండి సుమారు 20 లక్షల విలువ చేసే 37 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలను గుడివాడ డి.ఎస్.పి శ్రీకాంత్ తో కలిసి జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్న ఐపీఎస్  

ముద్దాయి వివరాలు  బడుగు సుబ్బారావు తండ్రి నాగేశ్వరరావు 40 సంవత్సరాలు సాయిబాబా గుడి వద్ద యనమలకుదురు గ్రామము పెనమలూరు మండలం కృష్ణా జిల్లా.

శాశ్వత చిరునామా రాంనగర్, వల్లభాపురం గ్రామం, గుంటూరు జిల్లా. కేసు పూర్వాపరాలు వివరాల్లోనికి వెళితే ఈరోజు అనగా 28-3-2024 వ తేదీన రాబడిన విశ్వసినీయ సమాచారం మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలపై పమిడిముక్కల సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎం కిషోర్ బాబు ఆధ్వర్యంలో, తోట్లవల్లూరు ఎస్సై విశ్వనాథ్  పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి తోట్లవల్లూరు గ్రామం దగ్గర కృష్ణానది కరకట్ట రోడ్డుపై వాహనాలను విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తుండగా, ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఒక ద్విచక్ర వాహనంపై వెలుతూ పోలీసులను చూడగానే పారిపోవడానికి ప్రయత్నించగా అతడిని వెంటాడి పట్టుకున్నారు.  అతన్ని అదుపులోనికి తీసుకొని విచారించగా అతడు అంతర్ జిల్లాలలో దొంగతనాలకు పాల్పడుతున్న బడుగు సుబ్బారావు గా గుర్తించి, ఇప్పటివరకు అతను కృష్ణ, గుంటూరు, బాపట్ల, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలలోని సుమారు 18 పోలీస్ స్టేషన్ పరిధిలో 37 ద్విచక్ర వాహనాలను దొంగతనం చేశానని నేరం అంగీకరించాడు. అతని దగ్గర నుంచి సమాచారం సేకరించి అతడు చెప్పిన వివరాల ప్రకారం కృష్ణాజిల్లాలోని తోట్లవల్లురు, పమిడిముక్కల, కంకిపాడు, పెనమలూరు, మోపిదేవి, గుడివాడ టౌన్, రాబర్ట్ సన్ పేట పోలీస్ స్టేషన్ల పరిధిలో, ఏలూరు జిల్లా పరిధిలో ఏలూరు టౌన్, గుంటూరు జిల్లాలోని పొన్నూరు, గుంటూరు టౌన్, తెనాలి, బాపట్ల జిల్లాలోని రేపల్లె, అమృతలూరు, పోలీస్ స్టేషన్ల పరిధిలోని మరియు విజయవాడ సిటీ లోని కృష్ణలంక,సత్యనారాయణపురం, మాచవరం వన్ టౌన్, టూ టౌన్, పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగిలించబడిన 37 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్వాధీనం చేసుకున్న బైక్ ల విలువ సుమారు 20,00,000/-

నేరస్తుర వద్ద నుండి స్వాధీనం చేసుకున్న 37 ద్విచక్ర వాహనాలకు సంబంధించి 31 కేసులు నమోదు కాగా, మిగిలిన మోటార్ సైకిల్ లకు సంబంధించి పూర్తి విచారణ కొనసాగుతుంది అరెస్టు చేసిన ముద్దాయిని రిమాండ్ నిమిత్తం ఉయ్యూరు లోని 10 వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ గారి ముందు హాజరు పరచడం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన విచారణ పూర్తిపారదర్శకంగా జరుగుతుందని ఎస్పీ  తెలిపారు.  సుమారు 31 కేసులలో 37 ద్విచక్ర వాహనాలను దొంగిలించి, విలాసాలకు అలవాటు పడిన అంతర్ జిల్లాల ద్విచక్ర వాహనాల దొంగ ఆటలకు చెక్ పెట్టడానికి కృషిచేసిన గుడివాడ డిఎస్పీ గ ని, పమిడిముక్కల ఇన్స్పెక్టర్ ని ,తోట్లవల్లూరు ఎస్సై ని , ఈ కేసు ఛేదించడానికి కృషి చేసిన ప్రతి ఒక్క సిబ్బందిని ఎస్పీ  ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డులను అందజేయడం జరిగింది. నేరస్థుడు ఎంత తెలివిగా నేరం చేసినప్పటికీ పోలీసువారి డేగ కంటి చూపు నుండి తప్పించుకోవడం అసాధ్యమని, నేరస్తుడు ఎంతటి వాడైనా చట్టం ముందు తలవంచాల్సిందేనని ఎస్పీ  హెచ్చరించారు.