ఎన్నికలవేళ అంబేద్కర్ ని మరువరాదుఘనంగా పుట్టినరోజు వేడుకలు

ఎన్నికలవేళ అంబేద్కర్ ని మరువరాదుఘనంగా పుట్టినరోజు వేడుకలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు  

విజయవాడ _ జనచైతన్య (తమ్మిన గంగాధర్)

జై మాల మహానాడు అధ్యక్షులు గోగులమూడి రాము ఏప్రిల్ 14 ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్  జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని 

కుల, మత,రాజకీయాలకు అతీతంగా ప్రతి పల్లె లో, ప్రతి గ్రామం లో, ప్రతి జిల్లా లో అంగరంగ వైభవం గా జరుపుకోవాలని తెలియచేసారు. 

గన్నవరం నియోజకవర్గం లో భారీ స్థాయి లో  జయంతి వేడుకలు ఉత్సవాలు లా జరిగేలా ఏర్పాటు చేస్తున్నాము అని తెలియచేసారు. 

మన ప్రాంతము లో ఉన్న బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలను శుభ్రం చేసి చుట్టూ ఉన్న ప్రాంత మంత పరిశుభ్ర పరచాలని తెలియచేసారు. 

ఎన్నికల వేళ  ముందస్తు గానే రిటర్నింగ్ ఆఫీసర్ కి, దగ్గర లో ఉన్న పోలీస్ అధికారుల వద్ద ర్యాలి లకు అనుమతులు తీసుకునేందుకు ముందు గానే కార్యాచరణ సిద్ధం చేయాలనీ 

ఎన్నికల వేళ ఎటువంటి వివాదలకు తావు లేకుండా ప్రశాంతమైన వాతావరణం లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు జరుపుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలనీ   జై మాల మహానాడు వ్యవస్థాపకులు గోగులమూడి రాము, రాష్ట్ర ఉపాధ్యక్షులు బాపట్ల సుధీర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాపట్ల కిరణ్, రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దూరి శ్రీనివాస్ తెలియచేసారు.