నేటి జర్నలిజం-నడి బజార్లో జర్నలిజం అక్షరమా సిగ్గు పడకు-నేటి విలువ
నడి బజారులో జర్నలిజం
విజయవాడ-జన చైతన్య (రూషిత్ కుమార్)
అక్షరమా సిగ్గుపడకు
నీ విలువ ఎప్పటికీ తగ్గదులే.
శాసించే స్థాయి నుంచి యాచించే స్థాయికీ
నేటి కాలంలో జర్నలిజాన్ని నడి బజారులో అమ్మకానికి పెట్టారు కొందరూ అక్షరం ముక్క రాయడం రాని వాడు కూడా జర్నలిస్ట్ గా చెలామణి అవుతున్నాడు. పుట్టగొడుగుల చానల్స్, పత్రికలు వస్తున్నాయి. వాటి యజమానులు డబ్బులు తీసుకోని ఐడి కార్డ్స్, లోగోలు ఇవ్వడం వల్ల జర్నలిస్టులకు విలువ లేకుండా పోతుంది. వార్త రాయడం రాదు కానీ నాకు మించిన వాడు లేడనే విధంగా వ్యవహరిస్తున్నారు. అంతే కాకుండా మీడియా సమావేశాల్లో కనిపించారు, ఏ మీడియాలో పని చేస్తున్నారో చెప్పుకోలేని స్థితిలో కొంతమంది ఉన్నారు. ఎవడో ఒక్కరూ రాస్తే దాని ఫార్వర్డ్ చేయడం.. ఆ వార్త చూపించి సొమ్ము చేసుకునే షో కాల్డ్ జర్నలిస్టులను చూసి సభ్య సమాజం నవ్వుకుంటుంది. రాజకీయ పార్టీల నాయకులు, వివిధ శాఖల అధికారులు కూడా విలువ ఇవ్వని పరిస్థితి నెలకుంది. విలువలు, జవాబుదారీతనంతో కాకుండా ఇతరులు చేసే పాపంలో నా వాటా ఎంత అనే విధంగా మారింది. కొంతమంది తీరు వల్ల ఎదురువస్తే తప్పుకునే పరిస్థితి ఇప్పుడు నెలకుంది. ఒక్కప్పుడు జర్నలిస్టు శాసించే స్థాయి నుంచి నేడు యాచించే స్థాయి దిగజారమనేది చెప్పుకోలేని నిజం. అక్షరమా సిగ్గు పడకు. నీ విలువ ఎప్పటికీ తగ్గదు ఈ సమాజంలో... జై జర్నలిజం... జై జై జర్నలిజం.