టీడీపీ ఎన్నికల ప్రచారంలో వైసీపీ అల్లరి మూకలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు
శ్రీ సత్యసాయి జిల్లా, ఓ.డి. చెరువు మండలం,సున్నంపల్లిలో పుట్టపర్తి ఎన్డీఏ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సిందూరరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో వైసీపీ అల్లరి మూకలు వైసీపీ పార్టీ జెండా పట్టుకుని రెచ్చగొట్టే విదంగా కేకలు వేస్తూ ప్రవర్తించారు.
టీడీపీ నాయకులు కార్యకర్తలు సమయమనం పాటించి,అక్కడి నుండి ప్రచారం ముగించుకుని వెళ్లిపోయారు.ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపైన పోలీసులు చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూసుకోవాలని టీడీపీ,జనసేన,బిజెపి నాయకులు,కార్యకర్తలు పోలీసులను కోరారు.