ఉడుముల శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ గణ విజయం
ఉడుముల శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ గణ విజయం
జనచైతన్య న్యూస్- కొనకనమిట్ల
ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోనీ చిన్నారికట్ల గ్రామంలో ప్రాథమిక పాఠశాల చైర్మన్ బరిగే అదిలక్ష్మి వైస్ చైర్మన్ తుమ్మ హాసీనా రెడ్డి, హై స్కూల్ విద్య కమిటీ చైర్మన్ గా శిరిగురి యాకోబు వైస్ చైర్మన్ మరావతు బాలనరసయ్య లు ఏకీగ్రీవంగా ఎన్నికయ్యారు, పాఠశాల కన్వీనర్ గా ప్రధాన ఉపాధ్యాయురాలు వయోల వ్యవహరించి రెండు స్కూల్ లో 30 మంది కమిటీ సభ్యులను గ్రామ పెద్దల సమక్షంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ప్రధాన ఉపాధ్యాయురాలు వయోల తెలిపారు, ఎన్నిక ఏకగ్రీవంగా జరగడంతో చైర్మన్ వైస్ చైర్మన్ కమిటీ సభ్యులకు గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మురళి కృష్ణ, మాజీ ఎంపీపీ ఉడుముల రామనారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ ఉడుముల గురవారెడ్డి, జిల్లా కార్యదర్శి ఏలూరి సంజీవ రెడ్డి, సర్పంచ్ వెలుగొండయ్య, ఎంపీటీసీ ఉడుముల ధన లక్ష్మి, గ్రామ వైసీపీ నాయకులు పాఠశాల ఉపాధ్యాయిని, విద్యార్థిని, విద్యార్థుల, తల్లిదండ్రులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.