ప్రపంచవ్యాప్తంగా రైతుల నిరసనకు ప్రజా మద్దతు పలుకుదాం

రైతు నిరసన ప్రదర్శనలు 26 న చేపట్టండి

విజయవాడ _జన చైతన్య (తమ్మిన గంగాధర్)

 ప్రపంచ వాణిజ్య ఒప్పందాలను వ్యతిరేకించండి 

ఢిల్లీ సరిహద్దు రైతు ఉద్యమాలకు మద్దతు పలకండి .ఏపీ రైతు సంఘాల సమావేశం పిలుపు విజయవాడ  ఈనెల 26వ తేదీన సోమవారం రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రవేశపెట్టిన ప్రతిపాదనలను నిరసిస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టాలని ఏపీ రైతు సంఘాల సమావేశ సమితి పిలుపునిచ్చింది. ఈ మేరకు శుక్రవారం బాలోత్సవ భవన్లో రైతు సంఘాల సమావేశంసమావేశమయ్యారుఈ సందర్భంగా రైతు సంఘాల సమావేశం కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచ వాణిజ్య సంస్థ దోహా నగరంలో సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో వాణిజ్య సంస్థ ప్రతిపాదనలను నిరసిస్తూ రైతులు నిరసన ప్రదర్శనలు చేపట్టాలని కోరారు. వాణిజ్య సంస్థ ప్రతిపాదనలు వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని విమర్శించారు. ఆహార భద్రత చట్టాన్ని నిర్వీర్యంచేయాలని ఈ ప్రతిపాదనలుసూచిస్తున్నాయని దుయ్యబట్టారు. రైతు కొనుగోలు కేంద్రాలని రద్దు చేయాలని, వ్యవసాయ ఉత్పత్తుల కనీసం మద్దతు ధరను రద్దు చేయాలని, వివిధ దేశాల ప్రభుత్వాలని డబ్ల్యుటివో ఆదేశిస్తుందని అలాంటి ఆదేశాల్ని భారతదేశం లాంటి  వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దేశాలు తిరస్కరించాలని వడ్డే శోభనాదేశ్వరావు పిలుపునిచ్చారు. గత కొన్ని రోజులుగా హర్యానాలో జరుగుతున్న రైతు ఉద్యమాల్లో ఐదుగురు రైతులు తమ ప్రాణాలను కోల్పోయారని, దీనికి కారణమైనటువంటి హర్యానా ప్రభుత్వంపై కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. పంజాబ్ సరిహద్దులో ఈ ఘాతకానికి పాల్పడిన కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలకు ఆదేశాలు జారీ చేసిన హర్యానా ముఖ్యమంత్రిపైనా, హర్యానా హోంమంత్రి పైన, కేంద్ర హోంమంత్రి పైన కేసులు నమోదు చేయాలని పంజాబ్ ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి రైతులపై కేంద్ర బిజెపి ప్రభుత్వం తీవ్రమైన దమనకాండను కోనసాగిస్తూంటే నోరు మెదకపోవటం బాధాకరమన్నారు. ఇప్పటికైనా రైతులపై కేంద్రం దమనకాండను ఖండించాలని అధికార వైసిపికి, ప్రతిపక్ష టిడిపికి రైతు సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. లేదంటే రాబోయే ఎన్నికల్లో రైతు ఉద్యమం సెగతో నిరసన వ్యక్తం చేయని రాజకీయ పార్టీలకు రైతులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పై అంశాలపై దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు ఏపి రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. దానిలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో నియోజకవర్గ కేంద్రాల్లో రైతు సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎఐకెఎస్ రాష్ట్ర నాయకులు వై.కేశవరావు,  కృష్ణయ్య, ఏఐకెఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి వెంకటరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షులు ఈశ్వరయ్య, జిల్లా నాయకులు యల్లమందరావు, రైతు కూలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు సింహాద్రి ఝాన్సీ, జిల్లా నాయకులు వీరబాబు, జాగృతి రైతు సంఘం రాష్ట్ర నాయకులు మరీదు ప్రసాద్ బాబు, ఇఫ్టూ నాయకులు రామకృష్ణ, ఏఐయుటియుసి నాయకులు సుధీర్, ఏఐకెయంయస్ రాష్ట్ర అధ్యక్షులు ధీనవాహీ హరినాథ్, రాష్ట్ర నాయకులు తోట ఆంజనేయులు, ఎఐకెఎస్ జిల్లానాయకులుఆంజనేయుల, కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాగంటి హరిబాబు, ఏఐకేఎఫ్ కాసాని గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. తొలుత రైతు ఉద్యమంలో అమరులైన వారికి ఒక్క నిమిషం మౌనం పాటించారు. జోహార్లు అర్పించారు.