ఫాదర్ విన్సన్ పేర్రర్ ఆశయాలు కొనసాగిస్తాం

ఫాదర్ విన్సన్ పేర్రర్ ఆశయాలు కొనసాగిస్తాం

ఫాదర్ విన్సన్ ఫెర్రర్ ఆశయాలు కొనసాగిస్తాం

 జనచైతన్య న్యూస్- పెద్దపప్పూరు 

 అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలం లో 15వ వర్ధంతిలో జీవితకాలం పేద ప్రజల అభ్యున్నతకై సేవలందించిన ఫాదర్ విన్సన్ పెర్రర్ ఆశయాలు కొనసాగిస్తామని అనంతపురం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దపప్పూరు ఆదినారాయణ మాదిగ తెలియజేశారు. బుధవారం ఫాదర్ విన్సన్ పెర్రర్ 15వ వర్ధంతి సందర్భంగా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండల కేంద్రంలో ఆర్డిటి స్కూల్ ఆవరణంలోఅయన విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి ఆదినారాయణ మాదిగ వారు మాట్లాడుతూ పెర్రర్ స్పెయిన్ దేశంలో జన్మించి కరువు జిల్లాలో అడుగుపెట్టి అనేక అభివృద్ధి, చైతన్య కార్యక్రమాలు చేశారని పేద ప్రజలు ఫాదర్ విన్సన్ పెర్రర్ ని ఎప్పటికీ మర్చిపోలేరన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీలకు విద్య, వైద్యం, ఇల్లు, స్వయం ఉపాధి రంగాలు కల్పించి ఆదుకున్నారన్నారు. ఆర్థిటి సంస్థ అనంతపురం జిల్లాలో అడుగుపెట్టకుంటే దళిత,గిరిజనుల బతుకులు అంధకారంలో నలిగిపోయమన్నారు. కాలిబాటన జిల్లా నలుమూలలా తిరిగి కుల వివక్షత,పేదరికం,వెనకబాటుతనంపై అవగాహన పరుచుకొని సమూల మార్పు కోసం కృషి చేస్తూ ఎస్సీ,ఎస్టీల బతుకుల్లో వెలుగు రేఖ అయ్యారన్నారు.సేవకు మారు పేరు ఫాదర్ విన్సన్ పెర్రర్ ని కొనియాడారు. కార్యక్రమంలో సిపిఐ పెద్దపప్పూరు మండల కార్యదర్శి చింతా పురుషోత్తం, ఆర్ఎంపి చంద్రశేఖర్,ఆర్ డి టి సీఈవో ఓబులేసు, సిరీసి నెంబర్లు సి నీలావతి, ఈరన్న, ప్రసాదు, రత్నమ్మ, లక్ష్మీదేవి, సూరేపల్లి నారాయణమ్మ పాల్గొన్నారు.