డబురువారి పల్లిలో సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రచారం

డబురువారి పల్లిలో సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రచారం

డబురువారి పల్లిలో సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రచారం

ఓబులదేవర చెరువు.. శ్రీ సత్య సాయి జిల్లా ఓబులదేవర చెరువు మండలం డబురువారి పల్లిలో తెలుగు ప్రొఫెషనల్ వింగ్ సభ్యులు ఎద్దుల భాను కిరణ్ రెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ, సూపర్ సిక్స్ పథకాల గురించి ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి పల్లె సింధూర రెడ్డిని గెలిపించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3000 రూపాయల నిరుద్యోగ భృతి, స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ప్రతి ఏడాది 15000 రూపాయలు, ప్రతి రైతుకు ఏటా 20 వేల ఆర్థిక సహాయం,  ఇంటింటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు,  మహిళలకు  ఉచిత బస్సు ప్రయాణం, నెలకు 15వేల రూపాయలు అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎద్దుల నారాయణరెడ్డి, ఎద్దుల కరుణాకర్ రెడ్డి, ఎద్దుల చంద్రశేఖర్ రెడ్డి, జనసేన నాయకులు చక్రధర్, మహేష్, రవీంద్ర, శ్రీనివాసులు, గంగాధర్, ఆంజనేయులు, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.