పెద్దపప్పూరు, యాడికి మండల ప్రజలకు శుభవార్త
పెద్దపప్పూరు, యాడికి మండల ప్రజలకు శుభవార్త
జనచైతన్య న్యూస్-పెద్దపప్పూరు
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలంలో చాగల్లు రిజర్వాయర్ నుంచి యాడికి, పెద్దపప్పూరు మండలాల ప్రజలకు దాహం తీర్చేటువంటి మోటార్లను, పైప్ లైన్ని ఐదు సంవత్సరాల నుంచి గత పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు, ఎమ్మెల్యేే అస్మిత్ రెడ్డి గెలిచిన మరుక్షణమే వీటి వినియోగం గురించి ఉన్నతాధికారులతో చర్చించి వీలైనంత తొందరగా ఈ రెండు మండలాల ప్రజలకు తాగునీరు పుష్కలంగా ఇవ్వాలని అధికారులను కోరడం జరిగింది. 29 జులై 2024 ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సంబంధిత పనులను మొదలు పెట్టడం జరిగింది.